వనపర్తి : వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం సాల్కలాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన ఓకే కుటుంబముకు చెందిన నలుగురు బుధవారం రాత్రి మృతి చెందారు. నరసింహ అనే వ్యక్తి స్థానికంగా మామిడి తోట కౌలుకు తీసుకొని కుటుంబంతో అక్కడే జీవిస్తున్నాడు. ఏమయిందో తెలియదు కానీ, తన భార్య హేమలతకు ఉరివేసి అనంతరం ఇద్దరు పిల్లలుసాయి నిహాల్, సాయిశ్రీని సంపులో పడేసి హతమార్చాడు.
ఆ తర్వాత తాను చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అప్పుల బాధ వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తు్న్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.