ఖిల్లాఘణపురం, మే 27 : అకాల వర్షాలకు తడిసి ముైద్దెన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మండలకేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామా ల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి మొలకెత్తింది. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి బుధవారం ఖిల్లాఘణపురం, పెద్దమందడి మండలాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసి, మొలకెత్తిన ధాన్యాన్ని చూసి చలించిపోయారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 5లక్షల42వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని ప్రభు త్వం 90లక్షల ధాన్యం సేకరణ చేస్తున్నామని చెప్పి అందులో కూడా 40శాతం కొనుగోలు చేయలేదని విమర్శించారు. ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల రైతులు ధాన్యాన్ని అమ్మడానికి నెలలు నెలలుగా పడిగాపులు పడుతున్నారని, రైతుల దీనస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుందన్నారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ చెల్లిస్తామని చెప్పడంతో రైతులు ఆశపడి మో సపోయారన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతు లు ధా న్యం తీసుకొచ్చి నెల రోజులైనప్పటికీ నేటికి తూకాలలో జాప్యం, ట్రాన్స్‌పోర్ట్‌లో ఆలసత్వం కనిపిస్తుంద ని ఇందు కు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు.
కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి
కొనుగోలు కేంద్రాల్లో విస్తృతంగా పర్యటించి రైతుల బాధలను తెలుసుకున్న మాజీ మంత్రి కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడుతూ రైతుల హరిగోస వర్ణనాతీతమని వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు ల వేదికలను ఉపయోగించుకొని అందులో ధాన్యాన్ని నిల్వచేసే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. లారీలు, ట్రక్కులు లేని వారికి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు ఇచ్చారని విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. మాజీ మంత్రి వెంట రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాళ్లకృష్ణయ్య, మన్నెగౌడ్, పులిందర్, పీన్య నాయక్, ప్రతాప్, శివ, లక్ష్మణ్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తరుగు పేరుతో దోపిడీ ..
పెబ్బేరు, మే 27 : ధాన్యం కొనుగోళ్లలో అధికారులు తరుగుపేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన పెబ్బేరు, గుమ్మడం, సూగురు, రంగాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ రైతులకు వెన్నుదన్నుగా నిలిచారని, ధాన్యం అమ్ముకునేందుకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతులను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రైతు గోసను అర్థం చేసుకుని ఇప్పటికైనా కొనుగోళ్లను వేగవంతం చేయాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దిలీప్‌రెడ్డి, రాములు, కర్రెస్వామి, జగన్నాథం, వెంకటేశ్, రాజశేఖర్, ఎల్లారెడ్డి ఉన్నారు.