e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home News యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాక‌ర‌ణ‌

యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాక‌ర‌ణ‌

అమెస్ట‌ర్‌డామ్ : ఏటా భ‌త్యంగా ఇచ్చే కోట్ల రూపాయ‌లను తీసుకోవటానికి డ‌చ్ యువ‌రాణి నిరాకరించింది. ఎలాంటి ప‌ని చేయ‌కుండా ప్ర‌తిఫ‌లం ఆశించ‌డం త‌న‌కు అసౌక‌ర్యంగా ఉందంటున్నారామె. ఈ మొత్తాన్ని ఇత‌ర మంచి ప‌నికి వినియోగించాల‌ని కోరిందా యువ‌రాణి. కొత్త త‌రం రాచ‌రికంలో వ‌స్తున్న మార్పులకు ఇది సంకేతం అని ప‌లువురు చ‌రిత్ర‌కారులు చెప్పుకుంటున్నారు.

డచ్ సింహాసనం వారసురాలు, నెదర్లాండ్స్ యువరాణి అయిన‌ అమేలియా గ‌త డిసెంబ‌ర్ 7 వ తేదీన‌ మేజ‌ర్ అయింది. డ‌చ్ చ‌ట్టం ప్ర‌కారం రాజ‌కుంటుంబంలోని వారికి భ‌త్యంతోపాటు ఇత‌ర ఖ‌ర్చుల కింద పెద్ద మొత్తంలో డ‌బ్బు ఇస్తుంటారు. అమేలియా మేజ‌ర్ అయిన వెంట‌నే ఆమెకు నెద‌ర్లాండ్స్ ప్ర‌భుత్వం ఆన‌వాయితీగా భ‌త్యం, ఇత‌ర ఖ‌ర్చుల కోసం దాదాపు 1.9 మిలియన్ డాల‌ర్ల (భార‌త్ క‌రెన్సీలో దాదాపు రూ.14 కోట్లు) పంపించింది. అయితే, ఈ మొత్తాన్ని ఆమె సున్నితంగా తిర‌స్క‌రించింది. ఎలాంటి ప‌నిచేయ‌కుండా భ‌త్యం తీసుకోవ‌డం త‌న‌కు న‌చ్చ‌ద‌ని, ఈ మొత్తాన్ని ఏదైనా మంచి పనికోసం వినియోగించాల‌ని కోరింది.

- Advertisement -

ఆరెంజ్ యువరాణిగా పిలుచుకునే అమేలియా.. కింగ్ విల్లెం అలెగ్జాండర్ పెద్ద కుమార్తె. ఆమె జూన్ 10 న ఉన్న‌త పాఠ‌శాల నుంచి పట్టభద్రురాలైంది. ఈ యువరాణి యూనివ‌ర్శిటీకి వెళ్లేముందు వ‌చ్చే ఏడాది ఈ భ‌త్యం తీసుకుని చ‌దువుల‌కు వినియోగించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నట్లు డచ్ ప్రధానమంత్రి మార్క్ రుట్టేకు రాసిన లేఖ ద్వారా త‌న ఈ నిర్ణయం తెలియజేశారు. ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో చ‌దువులు చాలా ఇబ్బందిక‌రంగా త‌యార‌య్యాయ‌ని, అందువ‌ల్ల వ‌చ్చే ఏడాది చ‌దువుల కోసం ఆ మొత్తాన్ని వినియోగించుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపింది.

డచ్ మీడియా గ్రూప్ ప్రకారం.. ఆమె భత్యం ద్వారా రూ.11 కోట్లు, రాజ కుటుంబ సభ్యుల ఖర్చుల కోసం రూ.2.6 కోట్లు పొందుతారు. భ‌త్యం పొందుతున్న తొలి వార‌సురాలు అమేలియా కావ‌డం విశేషం. చారిత్రాత్మ‌కంగా డ‌చ్ రాజు, రాణి, రాణి త‌ల్లి మాత్ర‌మే నెద‌ర్లాండ్స్‌లో భ‌త్యం పొందుతున్నారు. ఘెంట్ విశ్వవిద్యాలయం 2012 లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, డచ్ రాజ కుటుంబం యూరప్‌లోని అత్యంత ఖరీదైన రాచరికం.

ఇవి కూడా చ‌ద‌వండి..

అంత్య‌క్రియ‌ల వేళ త‌ల్లి మాట విని లేచిన కొడుకు

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..

చ‌రిత్ర‌లో ఈరోజు.. ముంతాజ్‌ జ్ఞ‌ప్తిగా తాజ్‌మ‌హ‌ల్ నిర్మాణం

కొత్తిమీర‌-పుదీనా ప‌చ్చ‌డితో 7 ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు.. ఏవంటే..?

ఈ టెక్నాలజీతో ఎన్-95 మాస్క్‌లు, పీపీఈ కిట్ల‌ రీయూజ్ సాధ్యం..!

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ : ఒక్క మ్యాచ్‌తో విజేత‌ను నిర్ణ‌యించ‌డం సరికాదు : స‌చిన్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana