Manne Krishank | యువత రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తెలిపారు. దయచేసి వారికి గోడలు కట్టకండి అని కోరారు. కేసీఆర్, కేటీఆర్ వంటి నాయకత్వంలో పనిచేసేందుకు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. మేం గులాబీ జెండాలు ఎత్తాలి.. తెలంగాణను మళ్లీ అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని అన్నప్పుడు.. కొత్త రక్తాన్ని రానివ్వాలని అన్నారు. కానీ నువ్వు అక్కడికి పోవాలంటే పర్మిషన్.. నువ్వు ఇక్కడికి పోవాలంటే పర్మిషన్ .. నువ్వు చెప్పిపోవాలంటే అది రాజకీయం కాదు.. బానిసత్వం అవుతుందని అన్నారు. మనం తెలంగాణ కోసం కొట్లాడిందే బానిసత్వం లేని స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసమని తెలిపారు.
అందరి దగ్గరకు వెళ్లండి.. మీకు నచ్చిన వారి దగ్గరకు వెళ్లండి.. కలిసి పనిచేయండని మన్నె క్రిశాంక్ సూచించారు. వ్యక్తులు శాశ్వతం కాదు.. పార్టీనే శాశ్వతం అని స్పష్టం చేశారు. గత ఉప ఎన్నికల సమయంలో మనల్ని చాలా అవమానపరిచారని గుర్తుచేశారు. గెలుపోటములు సహజం కానీ.. ఉప ఎన్నికల సమయంలో పైశాచికత్వంగా ప్రవర్తించారని తెలిపారు. కారు గుర్తును బుల్డోజర్తో తొక్కి తొక్కి ఇటుతిప్పి, అటుతిప్పి చేసిండ్రు అని అన్నారు. దానికి మనం ప్రతీకారం తీర్చుకోవాలంటే పోరాడాలని సూచించారు.
యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు..దయచేసి గోడలు కట్టకండి..!!
నన్ను దాటి వెళ్లకూడదు..పర్మిషన్ తీసుకోవాలి అని రూల్స్ పెట్టకండి🙏🏾
ఇక్కడ వ్యక్తులు కాదు పార్టీ శాశ్వతం.@Krishank_BRS అన్న 👌🔥
pic.twitter.com/dFJoaAfRg3— Srujan Kyatham (@SrujanKyatham) May 31, 2026
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మన్నె క్రిశాంక్ పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం 2009లో ఓయూలో మొదలైందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తెలిపారు. ఉద్యమకాలంలో పాల్గొన్న యువ నాయకులను కేసీఆర్ రాజకీయంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. పార్టీ ఆశయాలతో పాటు వ్యవస్థ బాగుకోసమే సభ్యత్వ నమోదు చేపట్టారని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీసేలా యువతను జాగృతం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మనకు అండగా కేసీఆర్, కేటీఆర్ ఉన్నారనే భరోసా ఉంటుందని అన్నారు. ఏ కొత్త ఆలోచన చేసినా కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.