Raaka | ‘రాకా’ నుంచి గ్లింప్స్ రాబోతుందా?.. అల్లు అర్జున్ మూడు షేడ్స్‌లో కనిపించబోతున్నాడా..!
Raaka | ‘పుష్ప’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా సంచలన క్రేజ్ సంపాదించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా ‘రాకా’ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోంది.
Raaka | ‘పుష్ప’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా సంచలన క్రేజ్ సంపాదించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా ‘రాకా’ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నప్పటికీ, ప్రాజెక్ట్‌పై రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘రాకా’ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసే దిశగా చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోందట.
సినిమా ప్రపంచాన్ని, కథ నేపథ్యాన్ని, విజువల్ స్కేల్‌ను పరిచయం చేసే విధంగా ఈ గ్లింప్స్‌ను రూపొందిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అట్లీ తన సినిమాల్లో భారీ విజువల్స్, మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ కథనాలకు పేరుగాంచిన దర్శకుడు. ఈసారి అల్లు అర్జున్‌తో కలిసి అంతర్జాతీయ స్థాయి విజువల్ అనుభూతిని అందించేలా ‘రాకా’ను రూపొందిస్తున్నట్లు సమాచారం. అందుకే గ్లింప్స్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన ఆసక్తికర వార్త కూడా వైరల్ అవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ ఈ చిత్రంలో మూడు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నారట. కథలో కీలకమైన మూడు దశలను ప్రతిబింబించేలా ఆయన పాత్ర డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇప్పటికే షూటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అట్లీ ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారమే చిత్రీకరణ జరుగుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఇక సంగీత బాధ్యతలను యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకార్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన కంపోజ్ చేస్తున్న ట్యూన్స్‌పై చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉందని తెలుస్తోంది. సినిమా కథ, విజువల్స్‌తో పాటు సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం గ్లింప్స్ విడుదలపై వస్తున్న వార్తలపై అధికారికంగా క్లారిటీ లేదు. గ్లింప్స్ విడుదలైతే ‘రాకా’ ప్రపంచం ఎలా ఉండబోతోందో, అట్లీ-బన్నీ కాంబినేషన్ ప్రేక్షకులకు ఎలాంటి సరికొత్త అనుభూతిని అందించబోతోందో తొలి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- atlee
- first look
- glimpse
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

