Harish Rao | రైతాంగానికి 3 గంటలు కరెంట్ చాలని అధికారికంగా కాంగ్రెస్ పార్టీ వాదనలు.. ఈఆర్సీ ముందు రికార్డై ఉంది : హరీశ్ రావు
Harish Rao | ఈ ప్రభుత్వ విధానం చూశాం. గతంలో రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటలు కరెంట్ చాలు అని చెప్పారు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్ ప్రభుత్వం తరుపున, కాంగ్రెస్ పార్టీ తరపున రైతు కమిషన్ చైర్మన్‌గా అధికారిక హోదాలో ఆయన వాదనలు వినిపించారని హరీశ్ రావు లేదన్నారు.
Harish Rao | రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదు.. మూడు గంటలు చాలని ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి.. మరోవైపు రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ విషయమై హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ..ఈ ప్రభుత్వ విధానం చూశాం. గతంలో రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటలు కరెంట్ చాలు అని చెప్పారు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్ ప్రభుత్వం తరుపున, కాంగ్రెస్ పార్టీ తరపున రైతు కమిషన్ చైర్మన్‌గా అధికారిక హోదాలో ఆయన వాదనలు వినిపించారు. అధికారికంగా ఈఆర్సీ ముందు మినిట్స్ రికార్డు అయినయ్.
రైతాంగానికి మూడు గంటలు కరెంట్ చాలని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈఆర్సీ ముందు వాదనలు వినిపించింది. అది ఈ రోజు ఈఆర్సీ ముందు రికార్డై ఉంది. రేవంత్ రెడ్డి కూడా 3 గంటలుచాలన్నడు. రేవంత్ రెడ్డిలాగా అబద్దాలు మాట్లాడుడు మాకు ఇంటా వంటా లేదు. మాకు నీతి, నిజాయితీ తెలుసు.. ఏది మాట్లాడినా పద్దతి తెలుసు. ఆధారాలతో, లెక్కలతో మాట్లాడుతం. రేవంత్ రెడ్డిలాగా బట్ట కాల్చి మీదేయడమో.. అబద్దాలు మీదేసి పబ్బం గడుపుకునే మాకు ఇంటా వంటా లేదన్నారు.
రేవంత్ రెడ్డిని చాలెంజ్ చేస్తున్నా..
నువ్వు 24 గంటల విద్యుత్ ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓట్లడుగుతా అని చెప్పు దమ్ముంటే.. లేకపోతే నీకు దమ్ముంటే ఓట్లు అడుగను అని చెప్పు. రాష్ట్ర రైతాంగానికి ఇప్పుడే కరెంట్ రావట్లేదు. ఈ రోజు ఏ ఊరికన్నా పోదాం. ఈ మధ్యకాలంలో నేను నర్సాపూర్ సబ్‌స్టేషన్‌కు వెళ్లిన. జహీరాబాద్ సబ్‌స్టేషన్‌కు వెళ్లిన, సిద్దిపేటలో సబ్‌స్టేషన్‌కు వెళ్లిన ఎక్కడికి వెళ్లినా రైతులకు ఈ రోజే 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. నువ్వేదో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు నేను ఆర్పీడీసీఎల్ పెడుతున్నా అని చెప్పివవ్. నువ్వువచ్చిన తర్వాత 24 గంటలవిద్యుత్కు మంగళం పాడినవ్. ఈ రోజు రాష్ట్రంలో ఏ రైతుకు కూడా 13 గంటలకు మించి ఉచిత విద్యుత్ రావడం లేదని అన్నారు.
ఇవాళ నీ ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో 8-9 గంటలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతదని హరీశ్ రావు పేర్కొన్నారు. నాకు నీ బడేబాయ్ (నరేంద్ర మోదీ) చెప్పినట్టు అనిపిస్తుంది. గుజరాత్లో ఇవాళ కేవలం 7 గంటల కరెంటే వస్తది. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో 8 గంటలు మాత్రమే వస్తుంది. రేపు తెలంగాణలో కూడా అదే జరుగబోతుంది. ఇది నేను ఉత్తగనే మాట్లాడటం లేదు. మొన్న ఆర్పీడీసీఎల్ ఏర్పాటు సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవ్ నంబర్ 8. ఈ జీవో ప్రజలకు అందుబాటులో పెడతా. రినెవెబుల్ ఎనర్జీ (సోలార్ పవర్) టీజీఆర్‌పీడీసీఎల్‌కు కేటాయించినమని చెప్పిర్రు. సోలార్ పవర్ పొద్దున సూర్యోదయమై 7 గంటలకు మొదలవుతది.. సూర్యాస్తమమయ్యే 6గంటలకు సోలార్ పవర్ ఆగిపోతది. అంటే రైతులకు , లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లకు, మంచినీటి పథకాలకు టీజీఆర్పీడీసీఎల్ కింద ప్రభుత్వం పెట్టేసింది.
మరి టీజీఆర్‌పీడీసీఎల్‌కు రేవంత్ రెడ్డి ఏకరెంట్ ఇస్తా అంటున్నడు.. సోలార్ పవర్ ఇస్తా అంటున్నడు. థర్మల్ పవర్, హైడల్ పవర్ ఇయ్యడట. కేవలం సోలార్ పవర్ ఇస్తా అంటున్నడు.. మరి సోలార్ పవర్ ఎప్పుడుంటది. పొద్దున 7గంటలకు వస్తది.. సాయంత్రం 5 గంటలకు పోతది. అంటే 8-9 గంటలుంటది.. రేవంత్ రెడ్డి ఈ జీవో ద్వారా చెప్పకనే ఏం చెప్పిండంటే.. రేపు రాష్ట్రంలో రైతులకు ఈ జీవో ద్వారా 8-9 గంటలు కరెంట్ ఇస్తా అని ఈ జీవోలోచాలా స్పష్టంగా చెప్పిన్రు. అందుకే రేవంత్ రెడ్డిని 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా అంటేనే నువ్వు ఓట్లడుగు దమ్ముంటే.. అని చాలెంజ్ చేస్తున్నానన్నారు హరీశ్ రావు.
రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదు మూడు గంటలు చాలు
– కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి https://t.co/yPjg3YceIX pic.twitter.com/RcwzRc1KL5
— Telugu Scribe (@TeluguScribe) May 29, 2026
Read Also :
Naga Chaitanya | నీతో జీవితాన్ని పంచుకోవడం నా అదృష్టం.. శోభిత బర్త్‌డేపై నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్
Mahesh Babu | ఎప్పటికీ మీరే నా హీరో నాన్న .. కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్
ముగ్గురు స్నేహితులను కాపాడి కాపాడి ఆ పై తాను మృతి చెంది..అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

