e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home News ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్‌లీ గురూ..!

ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్‌లీ గురూ..!

మామిడిపండ్ల సీజ‌న్ వచ్చిందంటే మార్కెట్లు ఎంత ఘుమ‌ఘుమ‌లాడ‌తాయో క‌దూ. ఎక్క‌డ చూసినా మామిడిపండ్లే ద‌ర్శ‌న‌మిస్తూ మ‌న‌ల్ని వాటిని కొనేలా ఆక‌ర్శిస్తుంటాయి. మ‌న ద‌గ్గ‌ర కిలో మామిడి పండ్లు రూ.70-100 మ‌ధ్య దొరుకుతుంటాయి. అదే ద‌ర వంద దాటిందే అనుకో.. బంగారం అమ్ముతున్నావా? అంటూ ఫైరైపోతాం. అదే జపాన్‌కు చెందిన మామిడి పండ్ల ధ‌ర‌ను చూస్తే కండ్లు తేలేయాల్సిందే..!

ప్రపంచంలోనే చాలా ఖరీదైన మామిడి పండ్లు మ‌న‌కు జపాన్‌లో దొరుకుతున్నాయి. “తైయో నో టామాగో” అనే మామిడి రకం జపాన్‌లోని మియాజాకి ప్రావిన్స్‌లో మాత్రమే ఏప్రిల్‌-ఆగ‌స్ట్ నెల‌ల్లోనే క‌నిపిస్తాయి. ఈ మామిడి పండ్లు రెండు దాదాపు రూ.2.5 లక్షల వరకు ధ‌ర ప‌లుకుతుంటాయి. అదేంటి మామిడి పండ్లు ల‌క్ష‌ల్లోనా..? అని గుడ్లు తేలేస్తున్నారు క‌దూ! ఈ ర‌కం మామిడి పండ్ల‌ను ప్రత్యేక ఆర్డర్ తీసుకున్న‌ తర్వాతే పండిస్తారు. ఈ పండ్లు సగం ఎరుపు, సగం పసుపు రంగులో ఉంటాయి. జపాన్‌లో వేసవి-శీతాకాలాల మధ్య సీజన్‌లో పండిస్తారు. వీటిని ప్ర‌త్యేక ప‌ద్ధ‌తిలో పండిస్తున్నందు వ‌ల‌న‌ చాలా ఖర్చు అవుతుందంట‌. అందుకే రేటు కూడా అదిరిపోతుంది.

- Advertisement -

“తైయో నో టామాగోష అంటే జపాన్ భాష‌లో సూర్యుడి కోడిగుడ్డు. ఈ మామిడిలో యాంటీఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ కలిగి ఉంటాయి. అలసిపోయిన కళ్ళ సహాయకారిణిగా ఉంటుంది. దృష్టి స‌మ‌స్య‌లు రాకుండా ఈ మామిడి పండ్లు కాపాడ‌తాయ‌ని పోష‌కాహార నిపుణులు చెప్తున్నారు. వీటిని ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి చేసే ముందు వాటిని చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తార‌ని, అత్య‌ధిక నాణ్య‌తా ప్ర‌మాణాలు క‌లిగిన వాటినే ఎగుమ‌తి చేసేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం అనుమ‌తిస్తుంది.

కాయ కాయ‌గానే వాటిని మెష్ వస్త్రంతో కట్టివేసి పెంచుతారు. ఒక్కో మామిడి పండు బరువు దాదాపు 350 గ్రాముల వరకు ఉంటుంది. అంటే రెండు పండ్లు 700 గ్రాముల‌కు రూ.2.5 లక్షల ధ‌ర ప‌లుకుతుంది. కిలో కావాలంటే రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2017 లో ఈ మామిడి జత వేలం వేయగా.. రికార్డు మొత్తంలో 3600 డాల‌ర్ల‌కు అమ్ముడుపోయింది. అంటే అక్ష‌రాల రెండు లక్షల 72 వేల రూపాయలు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఒక ర‌కం శ్రేష్టమైన మామిడి పండ్లు పండిస్తున్న ఓ ఆసామి.. త‌న మామిడి పండ్ల‌ను ర‌క్షించుకునేందుకు సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకున్నాడని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి జ‌పాన్‌లో పండించే ఈ ర‌కం మామిడి పండ్ల‌ను దొంగ‌ల బారి నుంచి కాపాడుకునేందుకు ఎంత మంది గార్డ్స్ పెట్టుకోవాలో క‌దూ..!

ఇవి కూడా చ‌ద‌వండి..

మూడో అతిపెద్ద వ‌జ్రం దొరికింది.. ఎక్క‌డంటే..?

కరోనా పుట్టినిల్లు.. వుహాన్‌లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ?

యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాక‌ర‌ణ‌

అంత్య‌క్రియ‌ల వేళ త‌ల్లి మాట విని లేచిన కొడుకు

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..

చ‌రిత్ర‌లో ఈరోజు.. ముంతాజ్‌ జ్ఞ‌ప్తిగా తాజ్‌మ‌హ‌ల్ నిర్మాణం

కొత్తిమీర‌-పుదీనా ప‌చ్చ‌డితో 7 ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు.. ఏవంటే..?

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ : ఒక్క మ్యాచ్‌తో విజేత‌ను నిర్ణ‌యించ‌డం సరికాదు : స‌చిన్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana