e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News కరోనా పుట్టినిల్లు.. వుహాన్‌లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ?

కరోనా పుట్టినిల్లు.. వుహాన్‌లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ?

బీజింగ్ : క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప్రారంభ‌మైన చైనాలోని వుహాన్ న‌గ‌రం ఇప్పుడిప్పుడే యథాస్థితికి చేరుకుంటున్న‌ది. కోటికి పైగా జ‌నాభా ఉన్న ఈ న‌గ‌రంలో జ‌నం గత జ్ఞాపకాల‌ను మ‌రిచిపోయి నిత్య కార్య‌క‌లాపాల్లో బిజీ అవుతున్నారు. గ‌త కొంత‌కాలంగా ఈ న‌గ‌రంలో ఎక్క‌డ చూసిన భ‌యం గుప్పిట్లో బ్ర‌తికిన ప్ర‌జ‌లు క‌నిపించేవారు. ఇప్పుడు ప‌రిస్థితులు మారాయ్‌. ప్ర‌జ‌లు వ్యాపార, ఉద్యోగ కార్య‌క‌లాపాల్లో చేరిపోతున్నారు. మెల్ల‌మెల్ల‌గా ప‌ర్యాట‌కులు వుహాన్‌కు రావ‌డం మొద‌లైంది. దాంతో భ‌యం స్థానంలో ఉత్సాహం వారిలో క‌నిపిస్తున్న‌ది.

2020 ప్రారంభంలో వుహాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వచ్చినప్పుడు.. అది ప్రపంచం మొత్తాన్ని కదిలిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ వైరస్ మొదట్లో వుహాన్‌లో తీవ్ర కలకలం రేపింది. తర్వాత క్రమంగా భారతదేశం, బ్రెజిల్, బ్రిటన్, అమెరికాతో పాటు అనేక దేశాలకు వ్యాపించింది. ఇప్పటి వరకు ల‌క్ష‌ల‌ మంది ప్రాణాలను బ‌లితీసుకున్న‌ది. గ‌త కొన్ని రోజులుగా చైనా ప్ర‌భుత్వం విధించిన క‌ఠిన‌మైన నిర్బంధం కార‌ణంగా వుహాన్ ప్ర‌జ‌ల్లో ఇండ్ల‌లోనే ఖైదు చేయ‌బ‌డ్డారు.

- Advertisement -

వుహాన్‌లో చాలా కాలంగా కొత్త కేసులు ఏవీ న‌మోదు కాలేదు. టీకాలు వేయ‌డం వేగంగా జ‌రుగుతున్న‌ది. ఇప్పటివరకు చైనాలో 800 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ ఇచ్చారు. 2021 చివరి నాటికి జనాభాలో 80 శాతం మందికి టీకాలు వేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలో కరోనా ఇన్‌ఫెక్ష‌న్ కేసులు 300 కూడా లేవు, కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తొలినాళ్ల‌లో హువానన్ సీఫుడ్ మార్కెట్‌ను మూసివుంచారు. అయితే, దాని ప్రక్కనే ఉన్న పండ్ల మార్కెట్ తెరిచారు. వూహాన్ ప్రధాన మార్కెట్లలో కూడా ర‌ద్దీగా ఉండగా.. ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఆసియాలో పొడవైన యాంగ్జీ నదిలో క్రూయిజ్‌లు నడుస్తున్నాయి. బస్సు, మెట్రో, రైలు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. చాలా మంది మాస్క్‌లు లేకుండానే తిరుగుతున్నారు. చాలా రోజుల పాటు ఇండ్లలో జైలు జీవితం గ‌డిపిన ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం సంతోషంగా రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. క‌ఠిన లాక్‌డౌన్‌, క్ర‌మ‌శిక్ష‌ణ కార‌ణంగానే త‌క్కువ వ్య‌వ‌ధిలో వైర‌స్‌ను అదుపులోకి తీసుకురాగ‌లిగార‌ని అక్క‌డ యోగా ఉపాధ్యాయులుగా ప‌నిచేస్తున్నా న‌రేశ్ కొఠారి, ఆశిష్ రావ‌త్‌, వ్యాపార‌వేత్త గోవింద ఖ‌త్రి చెప్పారు. ఇండ్ల‌లో నిర్బంధంలో ఉన్న స‌మ‌యంలో ప్ర‌భుత్వ‌మే ఆహారం, పానీయాల‌ను పంపిణీ చేసింద‌ని తెలిపారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాక‌ర‌ణ‌

అంత్య‌క్రియ‌ల వేళ త‌ల్లి మాట విని లేచిన కొడుకు

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..

చ‌రిత్ర‌లో ఈరోజు.. ముంతాజ్‌ జ్ఞ‌ప్తిగా తాజ్‌మ‌హ‌ల్ నిర్మాణం

కొత్తిమీర‌-పుదీనా ప‌చ్చ‌డితో 7 ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు.. ఏవంటే..?

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ : ఒక్క మ్యాచ్‌తో విజేత‌ను నిర్ణ‌యించ‌డం సరికాదు : స‌చిన్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana