రవీంద్రభారతి, మే 30: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. బీసీ వి ద్యార్థుల చదువులకు విఘాతం కలిగించే కు ట్రలో భాగంగానే బకాయిలు విడుదల చేయ డం లేదని విమర్శించారు. ‘బీసీ డిమాండ్ల సా ధన కోసం భవిష్యత్తు కార్యాచరణ’ అంశంపై జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్ దేశోద్దారకభవన్లో నిర్వహించిన సమావేశానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య, సిరికొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూద నాచారి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం లో కీలకపాత్ర పోషించిన బీసీలకు ఇప్పటికీ స ముచిత ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన చెందారు. బీసీల ఆర్థిక, విద్య, రాజకీయ సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ అవసరమ ని అభిప్రాయపడ్డారు.
తమిళనాడు తరహాలో తెలంగాణ బీసీలు కూడా ఏకమై చట్టసభల్లో 50% రిజర్వేషన్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం బీసీల హక్కు అని, అయితే తెలంగాణ రాజకీయాల్లో బీసీలు రెండోశ్రేణి పౌరులుగా కొనసాగుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రాబోయే 50, 60 ఏండ్లపాటు ఇదే ధోరణి కొనసాగాలన్న కుట్రతోనే సీఎం రేవంత్‌రెడ్డి బీసీలు చదువుకోకుం డా ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం ఎత్తివేయడానికి పూనుకున్నారని విమర్శించారు. బీసీలకు వ్యతిరేకంగా దేశంలో రెండు మూడు ర కాల కుట్రలు కొనసాగుతున్నాయని, అందు లో ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం ఒ కటి అని పేర్కొన్నారు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా, రాజ్యాధికారమే ధ్యేయంగా బీసీలంతా ఏకమై ఉద్యమించాలని కోరారు.
ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్నను ఎత్తివేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని, వాటిని తిప్పికొడుతామని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలను ఓటుబ్యాంక్‌గా ఉపయోగించుకోవడానికి సీఎం కుతంత్రాలు చేస్తూ బీసీలను మరోమారు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఖబర్దార్.. సీఎం రేవంత్‌రెడ్డీ.. బీసీలతో పెట్టుకున్న ఏ పాలకుడూ మళ్లీ అధికారంలోకి రాలేదని హెచ్చరించారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధులు కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తరహాలో బీసీ సబ్‌ప్లాన్ చట్టం తీసుకొచ్చి నిధుల వినియోగానికి చట్టబద్ధ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
బీసీల సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమ కార్యాచరణ చేపడుతామని సమావేశానికి అధ్యక్షత వహించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం తెలిపారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు, రూ.2.500 కోట్ల ప్రత్యేక నిధి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల, బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు, 42% రిజర్వేషన్ల అమలు డి మాండ్ల సాధక కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేషనల్ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ వీజీఆర్ నారగోని, ఓబీసీ సెల్ నేషనల్ ఇన్చార్జి కత్తి వెంకటస్వామి, బీజేపీ బీసీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.