Congress Party | కాంగ్రెస్ సర్కార్ మళ్లీ వస్తే రైతులకు నరకమే.. రేవంత్ రెడ్డితోనే క్లోజ్ : కాంగ్రెస్ కార్యకర్త
Congress Party | ఇప్పటికిపుడు ఎలక్షన్ పెడితే ఒక్క డిపాజిట్ కూడా రాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నాడు.అప్పుడు నేను కాంగ్రెస్కు ఓటెయ్యమని తిరిగినందుకు ఇప్పుడు ఊర్లో నన్ను అందరూ తిడుతున్నారని ఓ కాంగ్రెస్ కార్యకర్త అన్నాడు.
Congress Party | నేను కాంగ్రెస్ కార్యకర్తనే..కానీ ఈ ప్రభుత్వం గురించి చెప్పుకుంటే చెప్పుతో కొట్టుకున్నట్టే ఉన్నదని సొంత పార్టీ పాలనపై ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశాడు. సదరు కార్యకర్త మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు ఏమైనా మేలు జరిగిందా..? కేసీఆర్ రైతు రుణమాఫీ చేసిండు.. ఆయన చేసినవే ఈయన చేసిండు. కొత్తగా ఏం చేయలేదు.. క్రాప్ లోన్లు నేను ఇప్పించిన. అప్పుడు ఇప్పించినోళ్లకు కేసీఆర్ మాఫీ చేసిండు.. ఈయన మళ్లొచ్చి వాళ్లకే చేసిండు. కొత్తగా ఏదైనా పథకం అమలు చేసిండా రేవంత్ రెడ్డి..? అని ప్రశ్నించాడు.
ఒకవేళ ఈ ప్రభుత్వం మళ్లీ వస్తే రైతులకు నరకమే. ఇప్పటికిపుడు ఎలక్షన్ పెడితే ఒక్క డిపాజిట్ కూడా రాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నాడు. బోనస్ ఇస్తా అన్నడు.. అది కూడా ఏం లేదు. అప్పుడు నేను కాంగ్రెస్కు ఓటెయ్యమని తిరిగినందుకు ఇప్పుడు ఊర్లో నన్ను అందరూ తిడుతున్నారు. ఈ పార్టీ మళ్లీ 20 సంవత్సరాల దాకా లేవదు.. తొక్కి పడేసినట్టే. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితోనే క్లోజ్. మళ్లీ జన్మలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. మళ్లీ కేసీఆర్ రాకపోతే ప్రభుత్వం చాలా దెబ్బతింటది.
అడ్డి మారి గుడ్డి దెబ్బ లెక్క రేవంత్ అధికారంలోకి వచ్చిండు. కాంగ్రెసోళ్లంతా ఎప్పుడు పోతడో అని తలలు పట్టుకొని చూస్తున్నారు. అందరూ అన్నట్టు ఆయన రాజకీయ నాయకుడు కాదు.. గుంపు మేస్త్రీనే అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
నేను కాంగ్రెస్ కార్యకర్తను.. కానీ ఈ ప్రభుత్వం గురించి చెప్పుకుంటే చెప్పుతో కొట్టుకున్నట్లే ఉంది
ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతది.. డిపాజిట్లు కూడా రావు
అప్పుడు నేను కాంగ్రెస్కు ఓటెయ్యమని తిరిగినందుకు ఇప్పుడు ఊర్లో నన్ను అందరూ తిడుతున్నారు
ఇంక… pic.twitter.com/sTeyCd1ct0
— Telugu Scribe (@TeluguScribe) August 4, 2026
Read ALso :
Nizamabad | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి దోపిడీ
Gandhari | రామలక్ష్మణపల్లిలో అకాల వర్షానికి కొట్టుకుపోయిన వరి నాటు.. తీవ్ర నష్టంలో రైతులు
Odela | ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

