ఓటీటీ హిట్.. ఆత్మరక్షణ అవసరం
నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని దురదృష్టకర సంఘటనలు ఆడపిల్లల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమ్మాయిని బయటికి పంపించడమంటే.. ప్రమాదంలోకి నెట్టడమేనని భావించేలా చేస్తున్నాయి. దాంతో, చాలావరకు వారితో ఎవరో ఒకరిని తోడుగా పంపించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
తుడక్కమ్
జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతోంది.
తారాగణం: విస్మయ మోహన్ లాల్, మోహన్ లాల్ (అతిథి పాత్ర), ఆశిష్ జో ఆంటోనీ, బాబీ కురియన్, సాయి కుమార్, మనోజ్ కె. జయన్, కేబీ గణేష్ కుమార్ తదితరులు.
దర్శకత్వం: జూడ్ ఆంథోనీ జోసెఫ్.
నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని దురదృష్టకర సంఘటనలు ఆడపిల్లల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమ్మాయిని బయటికి పంపించడమంటే.. ప్రమాదంలోకి నెట్టడమేనని భావించేలా చేస్తున్నాయి. దాంతో, చాలావరకు వారితో ఎవరో ఒకరిని తోడుగా పంపించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలను నేర్పించాల్సిన అవసరాలను కూడా నొక్కి చెబుతున్నాయి. ఇదే పాయింట్ ఆధారంగా మలయాళంలో తెరకెక్కిన చిత్రం ‘తుడక్కమ్’. అంటే.. ఆరంభం! మలయాళ అగ్రనటుడు మోహన్‌లాల్ తనయ విస్మయ మోహన్‌లాల్ వెండితెరకు పరిచయమైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా ‘జియో హాట్ స్టార్’ వేదికగా తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చింది.
మీనూ (విస్మయ మోహన్‌లాల్) అనే అమ్మాయి చుట్టూ తిరిగే సర్వైవల్ థ్రిల్లర్ కథ ఇది. ఆమె తండ్రి రవి బాల చంద్రన్ (సాయికుమార్) విలేజ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. అతని రెండు కాళ్లూ చచ్చుబడి పోవడం వల్ల, వీల్‌చైర్‌లో కూర్చునే విధులు నిర్వహిస్తుంటాడు. తల్లిలేని బిడ్డ కావడంతో మీనూను చాలా గారాబంగా పెంచుతాడు. వీళ్ల ఇల్లు ఊరికి దూరంగా ఉంటుంది. అక్కడికి దగ్గర్లో జోసెఫ్ మాస్టర్ ఇల్లు తప్ప.. మరెవరూ ఉండరు. మీనూ ఓవైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు అదే ఊళ్లో చిన్న పిల్లలకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తూ ఉంటుంది. ధైర్య సాహసాలతోపాటు ఎదుటివారికి సాయం చేయడంలోనూ ఎప్పుడూ ముందుంటుంది.
అలాంటి మీనూ.. ఒకరోజు ఎగ్జామ్ రాయడానికి స్నేహితురాలు ప్రియతో కలిసి సమీపంలోని పట్టణానికి వెళ్తుంది. కానీ, రాత్రయినా ఇంటికి తిరిగి రాదు. రవి ఫోన్ చేసి మాట్లాడితే.. ట్రాఫిక్‌లో ఇరుక్కున్నానని చెబుతుంది. ఫోన్లో మాట్లాడుతూనే.. ఎవరితోనో గొడవ పడుతుంది. ఆ మాటలు ఫోన్లోనే వింటాడు రవి. మళ్లీ కాల్ చేస్తే.. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో, కూతురు ఆపదలో పడిందని ఆందోళనకు గురవుతాడు. తోడుగా వెళ్లిన ప్రియ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మరింత టెన్షన్ పడతాడు. అసలు మీనూ ఎవరితో గొడవ పడింది? ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నది? అందులోంచి ఎలా బయటపడ్డది? ఈమధ్యలో మాస్టర్ (మోహన్ లాల్) ఎవరు? అతనికి, మీనూకి మధ్య ఉన్న అనుబంధం ఏంటి? అసలు.. మీనూ మిస్సింగ్ వెనక ఉన్న కథ ఏంటి? అది తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

