WhatsApp | వాట్సాప్ అకౌంట్ లాక్ అయ్యిందా.. అసలు కారణం ఇదే.. 24 గంటలు ఆగండి
WhatsApp : సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాడుతున్న వారిలో కొందరికి యాజమాన్య సంస్థ ‘మెటా’ షాకిచ్చింది. కొందరి అకౌంట్లను లాక్ చేసింది. వారికి అకౌంట్ ఇన్ రివ్యూ అని కనిపిస్తుంది. అయితే, ఇలా మీ అకౌంట్ లాక్ అయితే, కంగారు పడాల్సిన అవసరం లేదు.
WhatsApp : సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాడుతున్న వారిలో కొందరికి యాజమాన్య సంస్థ ‘మెటా’ షాకిచ్చింది. కొందరి అకౌంట్లను లాక్ చేసింది. వారికి అకౌంట్ ఇన్ రివ్యూ అని కనిపిస్తుంది. అయితే, ఇలా మీ అకౌంట్ లాక్ అయితే, కంగారు పడాల్సిన అవసరం లేదు. రివ్యూ తర్వాత 24 గంటల్లోగా ఆ అకౌంట్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. సోమవారం రాత్రి 08.00 గంటల నుంచి ఈ ప్రక్రియను వాట్సాప్ ప్రారంభించింది. వాట్సాప్ ప్రతిఏటా అనేకసార్లు అకౌంట్లను రివ్యూ చేస్తుంది.
తమ సంస్థ నిబంధనలకు అనుగుణంగా అకౌంట్ ఉందా, లేదా అని సమీక్షించేందుకు కొన్ని అనుమానాస్పద అకౌంట్లను తాత్కాలికంగా నిలిపివేస్తుంది. ఆ అకౌంట్లపై సమీక్ష జరుపుతుంది. ఒకవేళ ఆ అకౌంట్ నిబంధనలకు అనుగుణంగా ఉంటే వాటిని 24 గంటల్లోగా పునరుద్ధరిస్తుంది. లేకపోతే, ఆ అకౌంట్లను శాశ్వతంగా బ్లాక్ చేస్తుంది. ఈ విషయంలో యూజర్లకు ఏమైనా అభ్యంతరాలుంటే మెటాను సంప్రదించి రివ్యూ కోరే అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు ఇండియా సహా అనేక దేశాల్లో పలు వాట్సాప్ అకౌంట్లను మెటా బ్లాక్ చేస్తోంది. దీనికి సంబంధించి యూజర్లకు అకౌంట్ రివ్యూ అంటూ నోటిఫికేషన్ కూడా వస్తోంది. తమ టర్మ్స్ అండ్ కండీషన్స్‌కు అనుగుణంగా రివ్యూ జరుపుతున్నామని, 24 గంటల్లోగా అకౌంట్లను పునరుద్ధరిస్తామని చెబుతూ ఆ మెసేజ్ కనిపిస్తోంది. సోమవారం రాత్రి నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో కొందరు యూజర్లకు తాత్కాలికంగా వాట్సాప్ సేవలు నిలిచిపోతున్నాయి.
దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు మెటాకు ఫిర్యాదు చేస్తున్నారు. వాట్సాప్ అకౌంట్లు సేఫ్‌గా ఉండేందుకు, ఇతర యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మెటా ఈ పని చేస్తుంది. వేధింపులకు పాల్పడే, అభ్యంతరకర, తప్పుడు సమాచారం ప్రసారం చేసే అకౌంట్లను మెటా బ్లాక్ చేస్తుంది. దీనిపై మెటా అధికారికంగా స్పందించలేదు. అయితే, వాట్సాప్ సేవలు దుర్వినియోగం కాకుండా చూడటమే తమ లక్ష్యమని, అందువల్లే రివ్యూ చేస్తున్నామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

