నో ఎస్టిమేషన్..!
మిర్యాలగూడలోని ఓ వార్డులో చేపడుతున్న అభివృద్ధి పనులను చూస్తుంటే నిధులు ఏ విధంగా దుర్వినియోగమవుతున్నాయో తెలుస్తుంది.
- రోడ్డుపైనే మళ్లీ రోడ్డు
- అభివృద్ధిపేరుతో మంచిగా ఉన్న రహదారిపై మళ్లీ రోడ్డు
- అధికార పార్టీ నాయకుడి నిర్వాకం
మిర్యాలగూడటౌన్, మే 30: మిర్యాలగూడలోని ఓ వార్డులో చేపడుతున్న అభివృద్ధి పనులను చూస్తుంటే నిధులు ఏ విధంగా దుర్వినియోగమవుతున్నాయో తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో రూ. లక్షల నిధులతో చేసిన అభివృద్ధి పనులనే మళ్లీ చేస్తూ ప్రజా ధనం కాజేసే కుట్ర జరుగుతున్నది. మిర్యాలగూడలోని 40వ వార్డులో వేసిన రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా లేని వార్డుల్లో పనులు చేపట్టకుండా అన్నీ బాగున్న చోట ఎలాంటి ఎస్టిమేషన్లు కానీ, నిధులు మంజూరీ లేఖ కానీ లేకుండా రాష్ట్ర స్థాయిలో పలుకుబడి ఉందని, నిధులు ఎట్లయినా తెస్తామని అధికార బలంతో ఓ నాయకుడు ఏకంగా గతంలో వేసిన రోడ్డుపైనే మళ్లీ రోడ్డు వేస్తుండటంతో అవార్డు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
దీంతో రోడ్డు ఎత్తు పెరిగి ఇండ్లు కిందకి అవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని ఇండ్ల యజమానులు వాపోతున్నారు. పట్టణంలోని ఏరియా దవాఖాన వెనుక భాగంలో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులపై పలు ఆరోపణలు వస్తున్నాయి. విచిత్రమేమిటంటే ఈ రోడ్డుకు నిధులు మంజూరు కాలేదు. దీంతో మున్సిపల్ అధికారులు నిర్మాణ పనులను, నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం లేదు. ప్రస్తుతం ఈ ఒక్క వార్డులోనే పనులు జరుగుతున్నాయి. దీంతో వివిధ వార్డుల కౌన్సిలర్లు తమ వార్డుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులను వివరణ కోరగా సదరు పనులకు మున్సిపాలీటీకి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్రస్థాయి నాయకుడి పలుకుబడితో స్పెషల్ ఫండ్స్‌తో నిర్మిస్తున్నారని తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

