హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : కార్మికుల సమస్యల పరిషారం, కనీస వేతనాల పెంపు, కాంట్రాక్ట్, ఫిక్స్డ్ టర్మ్ కార్మికుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్ల సాధన కోసం భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సోమవారం ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందిరాపార్ ధర్నా చౌక్‌లో భారీ సభ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి టీ రాంరెడ్డి తెలిపారు. ‘కార్మికులకు కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలి.
ఈఎస్ఐ వేతన పరిమితిని రూ.21 వేల నుంచి రూ.40 వేలు, ఈపీఎఫ్ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలి. ఈపీఎస్-95 కనీస పెన్షన్‌ను నెలకు రూ.వెయ్యి నుంచి రూ.7,500కు పెంచడంతోపాటు డీఏ, వైద్య సదుపాయం కల్పించాలి. బోనస్ లెకింపు పరిమితిని రూ.7 వేల నుంచి రూ.18 వేలకు, బోనస్‌కు అర్హత వేతన పరిమితిని రూ.21 వేల నుంచి రూ.42 వేలకు పెంచాలి. కార్మిక వ్యతిరేక నిబంధనలను లేబర్ కోడ్ల నుంచి తొలగించాలి. గ్రాట్యుటీ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచాలి. బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పని విధానం అమలుచేయాలి’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయనున్నట్టు తెలిపారు.