కార్మికుల సమస్యల పరిషారం, కనీస వేతనాల పెంపు, కాంట్రాక్ట్, ఫిక్స్డ్ టర్మ్ కార్మికుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్ల సాధన కోసం భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.
కనీస వేతనాల జీవోను తక్షణమే సవరించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి టీ రామిరెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.