Harish Rao | సాధారణంగా ఎప్పుడైనా ప్రతిపక్షం నుంచి అధికారంవైపు పోతరు.. ఇంకా ఎన్నికలు రెండేళ్లున్నాయి. కానీ ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. ఇది దేనికి సంకేతం ఇక కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు . నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీ చేరారు. వారికి హరీశ్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లవుతోంది.. వీళ్లవి ఉత్తుత్త మాటలే తప్ప చేతలేవి లేవని మనసున పట్టింది. ఈ రోడ్లు కూడా వేయడానికి చేతనైతలేదు.. కొత్తరోడ్డు కాదు.. ఉన్న రోడ్డుకు పొక్కలు పడితే డాంబర్ పోయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లయింది. ఆనాడు కేసీఆర్ రోడ్డు వేయిస్తే బొక్కలు పడితే డాంబర్ పోసే తెలివిలేదు ప్రభుత్వానికి అన్నారు. ఇందులో ఉంటే కూడా దండగే..దీంతో కాంగ్రెసోళ్లమని చెప్పుకుందామంటే వాళ్లకు భయమైతుందన్నారు.
రోడ్డుకు పొక్కలు పడ్దయి కదా.. డాంబర్ పోసే చేతనైతలేదా..? అని పబ్లిక్ తిడుతున్నరు.. ఇక కాంగ్రెస్లో ఉండి తిట్లు తినే దానికంటే కేసీఆర్ నాయకత్వంలో పనిచేసింది నయమనుకున్నారని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఏ ఊరు పోయినా ఇదే పరిస్థితి. మోచేయి లోతుల్లో గుంతలున్నాయి. పాపం ప్రజలు ప్రమాదాలు జరిగి కాళ్లు, చేతులు విరిగి ఇబ్బంది పడుతున్నారు. కడుపులో ఉన్న బిడ్డ దవాఖానకు కూడా ముట్టేది డౌటు ఉంది.. ఈ ప్రభుత్వం పిచ్చోడి చేతిలో రాయిలాగా అయిపోమింది. ఎందుకీ మాట అంటున్నానంటే.. ఫ్యూచర్ సిటీ అని పెట్టిండు. అది ప్యూచర్ లేని సిటీ. అక్కడ ఊరు లేదు.. వాడ లేదు.. మనిషి లేడు.. అక్కడికేమో 10 వేల రూపాయల కోట్లు పెట్టి రోడ్డు వేస్తడు.. ఇక్కడ మనుషులున్నం.. రాత్రి పూట రావాలంటే భయమవుతోందన్నారు.
LIVE: నర్సాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ చేరికల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish https://t.co/Rlx26uDxK5
— BRS Party (@BRSparty) October 3, 2026