అమరావతి : ఏపీలో విజయవాడ ( Vijayawada )లో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలిని చంపి ( Murder ) ఓ ప్రియుడు మూడంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య ( Suicide) చేసుకున్నాడు. మొక చిన్నా అనే యువకుడు మహాలక్ష్మి అనే యువతిని ప్రేమించాడు. వీరిద్దరికి పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించడంతో కొంతకాలంగా మహాలక్ష్మి ప్రియుడితో దూరంగా ఉంటుంది.
దీంతో ప్రియుడు చిన్నా గత నాలుగురోజులుగా యువతి వెంట పడుతూ పెళ్లి చేసుకోకపోతే చంపివేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం న్యూరాజరాజేశ్వరిపేటలో ప్రియురాలి మెడను కత్తితో నరికి అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం సమీపంలోని భవనంపైకి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.