IND vs WI : స్వదేశంలో వరసగా రెండో వన్డేలోనూ భారత బౌలర్లు తేలిపోయారు. గువాహటిలో వెస్టిండీస్ బ్యాటర్లను నిలువరించలేక భారీగా పరుగులు సమర్పించుకున్నారు. భీకర ఫామ్ కొనసాగిస్తూ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్(101) వేగంతమైన సెంచరీతో దడ పుట్టించగా.. ఆపై కెప్టెన్ షాయ్ హోప్(104), అమిర్ జంగూ(114)లు సైతం ధనాధన్ ఆటతో సెంచరీలు సాధించారు. వికెట్ తీసే టీమిండియా బౌలర్ కరువవ్వగా ఈ ముగ్గురి వీరకొట్టుడుతో విండీస్ స్కోర్ 38 ఓవర్లకే మూడొందలు దాటింది. ఆఖర్లో రోస్టన్ ఛేజ్(29 నాటౌట్) మెరుపులతో పర్యాటక జట్టు శుభ్‌మన్ గిల్ సేన ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపింది.
గువాహటిలో బౌండరీల వర్షం కురిసింది. తిరువనంతపురంలో దంచేసిన వెస్టిండీస్ బ్యాటర్లు మరోసారి టీమిండియా బౌలింగ్‌ను సులువుగా ఎదుర్కొంటూ.. మెరుపు బ్యాటింగ్‌తో భారీ స్కోరందించారు. విజయంతో సిరీస్ సమం చేయాలనే కసితో ఆడిన విండీస్ టాపార్డర్ సెంచరీలతో కదం తొక్కింది. ఓపెనర్ కేసీ కార్టీ(9)ని ప్రసిధ్ కృష్ణ(1-45) త్వరగా ఔట్ చేసినా ఆ ఆనందం భారత్‌కు దక్కలేదు.
Only the sixth time in ODIs where three hundreds have come in one innings 🙌
The West Indian batters are making merry in Guwahati pic.twitter.com/Q967VFetvK
— Cricinfo (@cricinfo) September 30, 2026
తొలి వన్డేలే అర్ధ శతకంతో రెచ్చిపోయిన జాన్ క్యాంప్‌బెల్(101: 68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సుడిగాలి శతకంతో చెలరేగాడు. అతడు ఎడాపెడా ఉతికేయడంతో పవర్ ప్లేలోనే విండీస్ వందకు చేరువైంది. 65 బంతుల్లోనే క్యాంప్‌బెల్ సెంచరీ అందుకోగా.. ఆపై భారత బౌలర్లకు కెప్టెన్ షాయ్ హోప్(104) జతగా అమిర్ జంగూ(114) చుక్కలు చూపించాడు.
మెరుపు శతకం బాదిన క్యాంప్‌బెల్‌ను గుర్నూర్ బ్రార్ వెనక్కి పంపినా విండీస్ పరుగుల వేగం తగ్గలేదు. క్రీజునంటుకున్న హోప్, జంగూ ద్వయం మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. అలవోకగా సింగిల్స్, డబుల్స్, బౌండరీలతో అలరించిన ఈ ఇద్దరు శతకాలతో విండీస్ స్కోర్ బోర్డును ఉరికించారు. వన్డేల్లో హోప్ 20వ సెంచరీ నమోదు చేయగా.. జంగూ రెండోసారి వంద పూర్తి చేసుకున్నాడు. హోప్‌ను కుల్దీప్ యాదవ్ (2-65) బోల్తా కొట్టించగా భారత బృందం ఊపిరి తీసుకుంది. కాసేపటికే జడేజా ఓవర్లో జంగూ వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే ఇద్దరూ ఔటైనా.. రోస్టన్ చేజ్(29 నాటౌట్), షమర్ జోసెఫ్ (14నాటౌట్)లు దూకుడుగా ఆడారు. ఫలితంగా నిర్ణీత ఓవర్లలో వికెట్ల నష్టానికి విండీస్ 405 పరుగులు చేసింది.
John Campbell beats some big names 🙌 pic.twitter.com/kBT0PbK6yZ
— Cricinfo (@cricinfo) September 30, 2026
ఒక ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది ఆరోసారి. తొలుత 2015లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా నమోదు చేసింది. అదే ఏడాది భారత్‌పై సఫారీ బ్యాటర్లు ముగ్గురు వందతో విరుచుకుపడ్డారు. 2022లో నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ ఆటగాళ్లు ముగ్గురు మూడు సెంచరీలు కొట్టారు. ఆపై 2023లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా, 2025లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా.. ఈసారి భారత్‌పై వెస్టిండీస్ బ్యాటర్లు ముగ్గురు తలొక శతకంతో రెచ్చిపోయారు.