హైదరాబాద్, ఆట ప్రతినిధి : ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)కు చెందిన పది ఫ్రాంచైజీలతో గోవాలో జరిగిన గార్డియన్స్ ట్రోఫీలో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ (హెచ్బీహెచ్) అండర్-21 జట్టు టైటిల్ గెలుచుకుంది.
ఆదివారం జరిగిన ఫైనల్లో హెచ్బీహెచ్.. 3-1 (15-7, 11-15, 16-14)తో ఆతిథ్య గోవాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. హెచ్బీహెచ్లో తెలంగాణ ప్లేయర్లు స్రునిక్(పెద్దపల్లి), అక్షిత్(వరంగల్) మెరిశారు.