e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News ఇవీ మిల్కాసింగ్ ఆరోగ్య సూత్రాలు..!

ఇవీ మిల్కాసింగ్ ఆరోగ్య సూత్రాలు..!

ఇవీ మిల్కాసింగ్ ఆరోగ్య సూత్రాలు..!

ర‌న్నింగ్ అనగానే మిల్కాసింగ్ పేరు గుర్తుకువ‌స్తున్న‌దంటే.. ఆ క్రీడా విభాగంలో ఆయ‌న సాధించిన ఘ‌న‌తే అందుకు కొల‌మానం. అదేవింధంగా ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి చెప్పాల్సి వ‌స్తే.. త‌ప్ప‌కుండా మిల్కాసింగ్ గురించి చెప్పాల్సిందే. అంత‌గా ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ద వ‌హించేవాడు. స‌మ‌స్త మాన‌వాళికి రోగాలు రాకుండా ఉండాలంటే తాను చెప్తున్న ఆరోగ్య సూత్రాల‌ను పాటిస్తే స‌రిపోతుంద‌ని క‌రోనా వైర‌స్‌కు గురికాక ముందు ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఫిట్‌నెస్ మంత్ర‌ను ఉప‌దేశించారు.

ఆరోగ్య సూత్రాలు ఆయ‌న మాట‌ల్లోనే..

ఆక‌లి అన్ని రోగాల‌కు మూలం. ఏ వ్యాధి అయినా క‌డ‌పు నుంచే మొద‌ల‌వుతాయి. అందుక‌ని పొట్ట‌ను అదుపులో పెట్టుకుంటే మ‌నం ఆరోగ్యంగా ఉన్న‌ట్లు లెక్క‌. ఆక‌లి అవుతుంద‌ని ఏది పడితే అది తిన‌కూడ‌దు. లెక్క లేకుండా తిన‌కూడ‌దు. ఆక‌లిగా ఉన్నా మితంగానే తినాలి. ఎంత ఆక‌లిగా ఉన్నా నాలుగు రొట్టెల‌కు బ‌దులుగా రెండు మాత్ర‌మే తినాలి. మ‌రో రెండు రొట్టెల స్థ‌లాన్ని ఖాళీగా ఉంచాలి. క‌డుపు ఖాళీగా ఉండ‌టం వ‌ల‌న వ్యాధులు ద‌రిచేర‌వు. శ‌రీరంలో రక్తం ఎంత‌సాఫీగా వేగంగా స‌ర‌ఫ‌రా జ‌రుగుతుందో.. అప్పుడు వ్యాధులు మ‌న నుంచి తొలిగిపోతాయి. ఎంత‌గా పొట్ట నిండుతుంటుందో అంత ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. త‌క్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తిన‌డం అల‌వాటు చేసుకోవాలి. ఉద‌యాన్నే వేడినీటిలో నిమ్మ‌కాయ ర‌సం తీసుకోవ‌డం, ఉద‌యం ఎండ‌లో క‌నీసం అర్ధ‌గంట సేపు ఉండటం అల‌వాటు చేసుకోవ‌డం ద్వారా మ‌న శ‌రీరంపై వైర‌స్‌లు, బ్యాక్టీరియాలు దాడిచేయ‌వు.

- Advertisement -

ఇకపోతే, ఫిట్‌నెస్ విష‌యానికొస్తే.. నిత్యం ఏదో ఒక రూపంలో శ‌రీరానికి వ్యాయామం క‌ల్పించాలి. అది పొలం పని కానీయండి. తోట ప‌ని కానీయండి. ర‌న్నింగ్‌, జాగింగ్‌, వాకింగ్‌, జిమ్ వ్యాయామం, యోగా.. ఇలా ఏదైనా స‌రే శ‌రీరంలో కొవ్వులు పేరుకుపోకుండా ఉండేది ఎంచుకోవాలి. నిత్యం అర్ధ‌గంట‌కు త‌క్కువ కాకుండా.. వారంలో ఐదు రోజులు వ్యాయామం చేయ‌డం అల‌వ‌ర్చుకోవాలి. కండ‌లు పెంచ‌డం కాకుండా కొవ్వులు క‌రిగించ‌డంపై దృష్టిపెట్టాలి. కాళ్లు, చేతులు క‌దిలించ‌క కూర్చుంటే కొత్త కొత్త వ్యాధులు మ‌న‌ల్ని చుట్టుముడ‌తాయి. ఫిట్‌నెస్‌తో శారీర‌క‌, మాన‌సిక ధృక్ప‌థం అల‌వ‌డుతుంది. వైద్యుని వ‌ద్దకు వెళ్లాల్సిన అవ‌స‌రం రాకుండా ఉండాలంటే.. ఆహారం, ఫిట్‌నెస్‌పై మ‌నుసు లగ్నం చేస్తే స‌రిపోతుంది.

అనేక రికార్డులు సృష్టించిన మిల్కా సింగ్.. 91 సంవత్సరాల వయస్సులో ఈ ప్రపంచం నుంచి వీడ్కోలు తీసుకున్నారు. 90 ఏండ్లు దాటినప్పటికీ ఫిట్నెస్, ఆహారానికి ఎన‌లేని ప్రాధాన్యం ఇచ్చేవారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

చ‌రిత్ర‌లో ఈరోజు : హిందుత్వానికి ప్ర‌తీక‌గా శివసేన ఆవిర్భావం

కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా అమెరికా మరో అడుగు

కిడ్నీ క్యాన్స‌ర్ ఎలా వ‌స్తుందంటే..?

ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్‌లీ గురూ..!

మూడో అతిపెద్ద వ‌జ్రం దొరికింది.. ఎక్క‌డంటే..?

యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాక‌ర‌ణ‌

అంత్య‌క్రియ‌ల వేళ త‌ల్లి మాట విని లేచిన కొడుకు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇవీ మిల్కాసింగ్ ఆరోగ్య సూత్రాలు..!
ఇవీ మిల్కాసింగ్ ఆరోగ్య సూత్రాలు..!
ఇవీ మిల్కాసింగ్ ఆరోగ్య సూత్రాలు..!

ట్రెండింగ్‌

Advertisement