Uber Cup | ఉబర్‌కప్ టోర్నీలో భారత్ అదిరిపోయే బోణీ
ప్రతిష్ఠాత్మక థామస్ కప్, ఉబర్‌కప్ టోర్నీలో భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం జరిగిన ఉబర్ కప్ తొలి పోరులో భారత్ 4-1 తేడాతో కెనడాపై అద్భుత విజయం సాధించింది. తొలుత జరిగిన మహిళల సింగిల్స్ పోరులో యువ షట్లర్ అశ్మిత చాలిహా 26-24, 24-22తో మిచెల్లీ లీపై సంచలన విజయం సాధించింది.
Uber Cup | చెంగ్డు(చైనా): ప్రతిష్ఠాత్మక థామస్ కప్, ఉబర్‌కప్ టోర్నీలో భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం జరిగిన ఉబర్ కప్ తొలి పోరులో భారత్ 4-1 తేడాతో కెనడాపై అద్భుత విజయం సాధించింది. తొలుత జరిగిన మహిళల సింగిల్స్ పోరులో యువ షట్లర్ అశ్మిత చాలిహా 26-24, 24-22తో మిచెల్లీ లీపై సంచలన విజయం సాధించింది. 42 నిమిషాల్లో ముగిసిన పోరులో తన(53 ర్యాంక్) కంటే మెరుగైన ర్యాంక్‌లో మిచెల్లీ(25)కి అశ్మిత ఊహించని షాక్ ఇచ్చింది.
మహిళల డబుల్స్‌లో ప్రియ, శృతి జోడీ 21-12, 21-10తో క్యాథరిన్, జెస్లిన్ ద్వయంపై గెలిచింది. మరో సింగిల్స్‌లో ఇష్రాని బారుహ్ 21-13, 21-12తో వెన్ యు జాంగ్‌పై గెలువడంతో భారత్ ఆధిక్యం 3-0కు చేరుకుంది. పురుషుల విభాగంలో భారత్ 4-1తో థాయ్‌లాండ్‌పై విజయం సాధించింది. సింగిల్స్‌లో ప్రణయ్ మినహా అందరూ గెలిచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

