e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News చ‌రిత్ర‌లో ఈరోజు : హిందుత్వానికి ప్ర‌తీక‌గా శివసేన ఆవిర్భావం

చ‌రిత్ర‌లో ఈరోజు : హిందుత్వానికి ప్ర‌తీక‌గా శివసేన ఆవిర్భావం

భార‌త‌దేశంలో హిందుత్వానికి ప్ర‌తీక‌గా నిలిచేందుకు బాల్ ఠాక్రే 55 సంవ‌త్స‌రాల క్రితం స‌రిగ్గా ఇదే రోజున శివ‌సేనను స్థాపించారు. అయితే, తాను ఏనాడూ ఎన్నిక‌ల్లో పోటీచేయ‌లేదు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని శివ‌సేన అధికారంలోకి రావ‌డంతో.. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఆయ‌న కుమారుడు ఉద్ద‌వ్ ఠాక్రే కొన‌సాగుతున్నారు. తొలుత‌ మరాఠీ ప్రజల హక్కుల కోసం పోరాడటానికి ఈ పార్టీని ఏర్పాటుచేశారు.

శివసేన ఏర్పడటానికి ముందు బాల్ ఠాక్రే ఒక ఆంగ్ల వార్తాపత్రికలో కార్టూనిస్ట్‌గా జీవితం కొనసాగించారు. మరాఠీ మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ అతడి తండ్రి ఆందోళన చేశారు. బొంబాయిలో ఇతర రాష్ట్రాల నుంచి పెరుగుతున్న ప్రజల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని బాలా ఠాక్రే ‘మార్మిక్’ అనే వార్తాపత్రికను ప్రారంభించి, వ‌ల‌స‌ల‌పై, మ‌రాఠీల‌పై ఇత‌రుల ఆధిప‌త్యంపై ప‌లు క‌థ‌నాలు త‌న ప‌త్రిక‌లో రాసేవారు. శివసేన ఏర్పడిన సమయంలో ‘అన్షి టేక్ సమాజ్కరన్, విస్ టేక్ రాజ్కరన్’ అనే నినాదాన్ని బాల్ ఠాక్రే ఇచ్చారు. అంటే 80 శాతం సమాజం, 20 శాతం రాజకీయాలు చేయాల‌ని దాన‌ర్థం.

- Advertisement -

పార్టీ ఏర్పడిన కొద్ది ఏండ్ల‌కే శివసేన బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. అయితే, మహారాష్ట్ర స్థానికుల సమస్య కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారం చేయడానికి మహారాష్ట్రకు వచ్చిన వారిపై అనేక దాడులు జరుగ‌డంతో.. క్రమంగా, పార్టీ మరాఠీ మనుష్ సమస్య నుంచి హిందుత్వ రాజకీయాలకు త‌న తీరును మార్చుకున్న‌ది. 1990 లో శివసేన మొదటిసారి మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇందులో పార్టీ 183 అభ్యర్థులను నిలుప‌గా 52 మంది గెలిచారు.అంత‌కుముందు, 1989 లో జరిగిన లోక్‌స‌భ ఎన్నికల్లో మొదటిసారి శివసేన నాయకుడు ఎంపీగా విజ‌యం అందుకున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో పార్టీకి 18 మంది ఎంపీలు ఉన్నారు. బాలా ఠాక్రే స్వయంగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. కానీ, 90 వ దశకంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా మారారు.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2018: జమ్ముక‌శ్మీర్‌లో పీడీపీతో పొత్తును వ‌దులుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన బీజేపీ

2017: కాబూల్ విమానాశ్రయంలో తొలి ఆఫ్ఘనిస్తాన్-ఇండియా ఎయిర్ కారిడార్‌ను ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని

1981: ఆపిల్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన భారతదేశం

1961: బ్రిటన్ నుంచి స్వతంత్ర‌దేశంగా అవ‌త‌రించిన కువైట్

1953: గూఢ‌చ‌ర్యం అనుమానంతో జూలియస్, ఎథెల్ రోసెన్‌బర్గ్‌లను అమెరికాలో ఉరితీత‌

ఇవి కూడా చ‌ద‌వండి..

కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా అమెరికా మరో అడుగు

కిడ్నీ క్యాన్స‌ర్ ఎలా వ‌స్తుందంటే..?

ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్‌లీ గురూ..!

మూడో అతిపెద్ద వ‌జ్రం దొరికింది.. ఎక్క‌డంటే..?

యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాక‌ర‌ణ‌

అంత్య‌క్రియ‌ల వేళ త‌ల్లి మాట విని లేచిన కొడుకు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana