అంత సెంటిమెంట్‌గా తీసుకోవద్దు.. కాక్రోచ్ జనతా పార్టీ కేసు విచారణపై సీజేఐ
వివాదాస్పద కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ ఉద్యమానికి సంబంధించిన పిటిషన్ల విచారణకు తక్షణ ఆవశ్యకత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. వాటిని అత్యవసరంగా విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
న్యూఢిల్లీ: వివాదాస్పద కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ ఉద్యమానికి సంబంధించిన పిటిషన్ల విచారణకు తక్షణ ఆవశ్యకత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. వాటిని అత్యవసరంగా విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ నేతృత్వంలో జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీఎం పంచోలీతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను తగిన సమయంలో విచారిస్తామని పేర్కొంది.
ఈ కేసును అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని న్యాయవాదులు కోరగా ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించాల్సిన అవసరం లేదని బదులిచ్చారు. ఈ విషయంలో అంత భావోద్వేగానికి గురికావద్దు అని న్యాయవాదులతో సీజేఐ వ్యాఖ్యానించారు.
ఎక్స్ ఖాతాను సస్పెండ్‌పై హైకోర్టుకు..
తన పార్టీకి చెందిన ఎక్స్ ఖాతాను జాతీయ భద్రతా కారణాలపై సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఆన్లైన్లో వైరల్ అయిన వ్యంగ్య రాజకీయ పార్టీకి చెందిన దీప్కే తన పార్టీ ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలు హ్యాక్ అయి ఆ తర్వాత సస్పెండ్ అయ్యాయని కూడా పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

