హైదరాబాద్, మే 25 (నమస్తేతెలంగాణ) : ప్రస్తుత పోటీ మారెట్లో సింగరేణి నిలదొకుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో కొత్త బ్లాకులను సాధించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంస్థ యాజమాన్యానికి దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా అత్యంత నాణ్యమైన బొగ్గును మార్కెట్లో విక్రయించే దిశగా ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు. సోమవారం సచివాలయంలో జరిగిన సింగరేణి కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక, ఎనర్జీ స్పెషల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రకాష్, సింగరేణి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గౌతమ్ పొట్రు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హరార వేణుగోపాల్, కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, గడ్డం వినోద్, విజయ రమణారావు, పాయం వెంకటేశ్వర్లు, గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.