ఎండలు మండిపోతుండడంతో ప్రజలు బయటికి వెళ్లడానికి భయపడుతున్నారు. నగరంలో ప్రజలు రోడ్డెక్కేందుకే జంకుతున్నారు. సాయంత్రం వరకు నగర రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.

సచివాలయం సమీపంలో మధ్యాహ్నం పూట రోడ్లపై జనసంచారం తగ్గిపోయింది. అయితే సాయంత్రం చల్లని వాతావరణానికి ప్రజలు రోడ్డెక్కడంతో సందడి వాతావరణం నెలకొంది.