e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News చరిత్రలో ఈరోజు : ఈ అందమైన రైల్వే స్టేషన్‌కు 134 ఏండ్లు

చరిత్రలో ఈరోజు : ఈ అందమైన రైల్వే స్టేషన్‌కు 134 ఏండ్లు

చరిత్రలో ఈరోజు : ఈ అందమైన రైల్వే స్టేషన్‌కు 134 ఏండ్లు

భారతదేశంలోని అత్యంత అందమైన, చాలా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్‌టీ) ను సరిగ్గా 134 ఏండ్ల క్రితం నిర్మించారు. భారతదేశంలో తాజ్ మహల్ తర్వాత ఈ భవనం ఎక్కువ ప్రాముఖ్యత గలదని చరిత్రకారులు చెప్తుంటారు. ముంబైలోని ఫోర్ట్ ఏరియాలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ నుంచి నిత్యం 30 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. టెర్మినస్ 18 ప్లాట్‌ఫాంల పైకి రోజూ 1200 కి పైగా రైళ్లు వస్తుంటాయి.

ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ సముద్రతీరం ప్రాంతంలో ఉన్నందున ముంబై బ్రిటిష్ వారికి ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. రోజూ వేలాది మంది వచ్చి వెళ్లి వెళ్లేవారు. వస్తువులను దిగుమతి, ఎగుమతికి వీలుగా ఉండేది. దీనికి ముందు బోరి బందర్ రైల్వే స్టేషన్ ఉండేది. భారతదేశంలో ప్రారంభమైన తొలి రైలు బోరి బందర్ రైల్వే స్టేషన్ నుంచి థానే వరకు నడిచింది. కానీ బోరి బందర్ రైల్వే స్టేషన్ వద్ద తగినంత స్థలం లేకపోవడంతో బ్రిటిషర్లు పెద్ద రైల్వే స్టేషన్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ స్టేషన్ నిర్మాణం కోసం బ్రిటిష్ ప్రభుత్వం రూ.16 లక్షలు విడుదల చేసి.. స్టేషన్ రూపకల్పన బాధ్యతను ఫ్రెడరిక్ విలియం స్టీవెన్స్‌కు అప్పగించారు. ఈ స్టేషన్ నిర్మాణ పనులు 1878 లో ప్రారంభమయ్యాయి.

- Advertisement -

ఈ భవనంలో భారతదేశం, బ్రిటన్, ఇటలీ నిర్మాణ శైలి కనిపిస్తుంది. ప్రధాన భవనంలో ఇసుక, సున్నపురాయిని ఉపయోగించగా, అందాన్ని ఇనుమడింపజేసేందుకు ఇటాలియన్ పాలరాయి, భారతీయ నీలం రాయిని వాడినట్లు చరిత్ర చెప్తున్నది.స్టేషన్ సెంట్రల్ హాల్‌ స్టార్ ఆకారంలో డిజైన్ చేశారు. ప్రస్తుతం ఇక్కడే మెయిన్‌ టికెట్ హౌస్ ఉన్నది. విక్టోరియన్ గోతిక్ శైలిలో నిర్మించిన ఈ భవనం మధ్యలో విక్టోరియా రాణి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు, అయితే, భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఆ విగ్రహాన్ని తొలగించారు.

1887 లో జూన్‌ 20 న పనులు పూర్తయి రవాణా కోసం ప్రారంభించబడింది. బ్రిటన్ రాణి పేరిట ఈ స్టేషన్‌కు విక్టోరియా టెర్మినస్ అని పేరు పెట్టారు. అయితే, 1996 లో అప్పటి రైల్వే మంత్రి సురేష్ కల్మాడి ఈ స్టేషన్ పేరును ఛత్రపతి శివాజీ టెర్మినస్‌గా మార్చారు. 2004 జూలై 2 న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ రైల్వే స్టేషన్‌ను ప్రకటించింది. 2008 ముంబై ఉగ్ర దాడిలో ఈ స్టేషన్‌ను కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ఇక్కడ జరిగిన కాల్పుల్లో 50 మందికి పైగా మృతిచెందారు.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

2019: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశమైన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్

1999: క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి కప్‌ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా

1895: కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ పట్టా పొందిన తొలి మహిళగా నిలిచిన కరోలినా విల్లార్డ్ బాల్డ్విన్

1840: టెలిగ్రాఫ్ కోసం పేటెంట్ పొందిన శామ్యూల్ మోర్స్

1837: 18 సంవత్సరాల వయసులో బ్రిటన్ రాణి అయిన విక్టోరియా

ఇవి కూడా చ‌ద‌వండి..

ఇవీ మిల్కాసింగ్ ఆరోగ్య సూత్రాలు..!

చ‌రిత్ర‌లో ఈరోజు : హిందుత్వానికి ప్ర‌తీక‌గా శివసేన ఆవిర్భావం

కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా అమెరికా మరో అడుగు

కిడ్నీ క్యాన్స‌ర్ ఎలా వ‌స్తుందంటే..?

మూడో అతిపెద్ద వ‌జ్రం దొరికింది.. ఎక్క‌డంటే..?

యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాక‌ర‌ణ‌

అంత్య‌క్రియ‌ల వేళ త‌ల్లి మాట విని లేచిన కొడుకు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చరిత్రలో ఈరోజు : ఈ అందమైన రైల్వే స్టేషన్‌కు 134 ఏండ్లు
చరిత్రలో ఈరోజు : ఈ అందమైన రైల్వే స్టేషన్‌కు 134 ఏండ్లు
చరిత్రలో ఈరోజు : ఈ అందమైన రైల్వే స్టేషన్‌కు 134 ఏండ్లు

ట్రెండింగ్‌

Advertisement