ఆఫ్ఘాన్‌లో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేస్తాం : తాలిబాన్ ప్రకటన
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ తమ విధానాలు, ఉద్దేశాలను పూర్తిగా స్పష్టం చేసింది. తాము ఆఫ్ఘనిస్తాన్ శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నానని నిర్మొహమాటంగా చెప్పింది. ఇదే సమయంలో ఆఫ్ఘన్లో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ తమ విధానాలు, ఉద్దేశాలను పూర్తిగా స్పష్టం చేసింది. తాము ఆఫ్ఘనిస్తాన్ శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నానని నిర్మొహమాటంగా చెప్పింది. ఇదే సమయంలో ఆఫ్ఘన్లో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. దేశంలో ఇస్లామిక్ నిబంధనల ప్రకారం మహిళలకు హక్కులు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నట్లు కూడా తెలిపింది. తాలిబాన్ నాయకత్వం ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తాలిబాన్ ప్రకటన మహిళలు, తాలిబాన్‌కు అనుకూలంగా లేని ప్రభుత్వానికి సమస్యలను పెంచుతున్నదని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, అమెరికా దళాలు ఇక్కడి నుంచి వైదొలిగిన తర్వాత తాలిబాన్ సంస్థ తమ పరిధిని గణనీయంగా పెంచుకుంటుండటం భయాందోళనలకు గురిచేస్తున్నది. గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను భవిష్యత్‌లో ఎదుర్కోవలసి వస్తుందని ఆఫ్ఘన్ మహిళలు భయపడుతున్నారు.
తాలిబాన్ పాలనలో గరిష్టంగా మహిళ మరణాలే ఎక్కువగా జరిగినట్లు అక్కడి గణాంకాలు చెప్తున్నాయి. మహిళల విద్య, క్రీడలు, సంగీతం మొదలైన వాటిని తాలిబాన్ ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. అదేవిధంగా స్త్రీలు రోడ్డు మీద లేదా ఎక్కడా ఒంటరిగా బయటకు వెళ్ళకూడదని ఆజ్ఞాపించారు. తాలిబాన్ ఫండమెంటలిస్టుల సమూహంలో మహిళలను హింసించేవారికి కొరత లేదు. 9/11 దాడుల అనంతరం అమెరికన్ బలగాలు ఆఫ్ఘాన్ రావడంతో మహిళల్లో కొంత ఊరట లభించడంతోపాటు బహిరంగ ప్రదేశంలో ఊపిరి పీల్చుకునే హక్కు లభించిందని ప్రజలు సంబురపడ్డారు. అయితే, శాంతి ఒప్పందంలో భాగంగా వచ్చే సెప్టెంబర్ 11 నాటికల్లా అమెరికా, నాటో దళాలు పూర్తిగా ఆఫ్ఘాన్ నుంచి విరమించుకుంటుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాలిబాన్ మరోసారి తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తుండటంతో ప్రజలు నిద్రకు దూరం అవుతున్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాలను తాలిబాన్ ఆక్రమించుకున్నది. గతంలో మాదిరిగా కాబూల్‌లో అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే తాలిబాన్ ఉద్దేశంగా ఉన్నది.
ఇవి కూడా చదవండి..
చైనాలో ఒక రోజు ముందుగా యోగా దినోత్సవం
ఫాదర్స్ డే నాడే తండ్రిని చంపిన తనయుడు.. ఎందుకంటే..?
కరోనాకు గురై టీఎంసీ ఎమ్మెల్యే కన్నుమూత
రిగ్గింగ్ జరిగిందంటూ కోర్టును ఆశ్రయించిన టీఎంసీ అభ్యర్థులు
రామ మందిరం విషయంలో మా ఎంపీవన్నీ అబద్దాలే
ఏడు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర క్యాబినెట్లో మార్పులు..!
చరిత్రలో ఈరోజు : ఈ అందమైన రైల్వే స్టేషన్‌కు 134 ఏండ్లు
ఇవీ మిల్కాసింగ్ ఆరోగ్య సూత్రాలు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

