e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home ఆరోగ్యం పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!

పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!

పొద్దునే లేవడం, పనంతా చేసుకుని గబ గబా ఏదో ఒకటి తిని ఆఫీసుకు బయల్దేరడం, ఆఫీసు పనయ్యాక తిరిగి ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకోవడం, తినడం పడుకోవడం.. ఇలా రోజంతా బిజీ బిజీగా గడిపేస్తున్నారా.. అలా అయితే మీ వ్యక్తిగత జీవితానికి మీకు మీరుగా అన్యాయం చేసుకుంటున్నట్లేనట. అంతే కాదు మీ భాగస్వామికి మీరు దూరం అవుతున్నట్లేనట. నిజమేనండి.. శృంగార జీవితాన్ని సరిగా గడపలేని లేని జంటలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మరేం చెయ్యాలి పని చేయకపోతే బతకలేం కదా…రోజంతా కష్టపడి అన్ని పనులు చేశాక శృంగారానికి ఓపిక ఉండదు కదా అని చాలామంది ఫీల్ అవుతుంటారు. కానీ సంతోషమైన జీవితానికి పనితో పాటు శృంగారం కూడా ముఖ్యమే అని అంటున్నారు చాలామంది సైకాలజిస్టులు. సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేసినప్పుడే జీవితంలో అన్ని పనులు బాగా చేయగలుగుతాం అంటున్నారు.

పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!

శృంగార కోరికలు ఉన్నప్పటికీ చాలా మంది సమయం లేకో.. భాగస్వామితో చనువు లేకో సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నారట. పని ఒత్తిడి కారణంగా ఓపిక లేక సెక్స్ లో పాల్గొనలేకపోతున్నామని మరికొందరు అంటున్నారు. ఇలాంటి వారిలో శృంగారంపై ఆసక్తి పెంచడానికి .. పని ఒత్తిడిని దూరం చేసుకుని సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం పదండి..

పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!

శృంగారం గురించి మాట్లాడుకోండి

- Advertisement -

చాలా మంది తమ భాగస్వామితో సెక్స్ విషయాలు మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. దీని గురించి మాట్లాడుకోవడమేంటి అని సిగ్గు పడుతుంటారు. కానీ శృంగారం గురించి, బెడ్ రూంలో మీ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకోవడం వల్ల మీ అభిప్రాయాలు బయటపడతాయట. తద్వారా మీ శృంగార జీవితం మరింత సుఖంగా మారుతుందట. అంతేకాదు.. మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా సాగుతుందట.

పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!

అప్పుడప్పుడూ ప్రేమగా తాకండి

చాలా మంది భార్యభర్తలు కేవలం బెడ్ రూంలోనే తప్ప మిగతా సమయాల్లో ఒకరినొకరు తాకరు. అందరూ ఉన్నారనో, ఎవరో చూస్తారనో ఇలా కారణాలేవైనా కావొచ్చు. కానీ అప్పుడప్పుడు మీరు తాకుతుండటం వల్ల పరస్పరం ప్రేమ పెరుగుతుందట. చిన్న చిన్న తాకిడిలు మీలో శృంగార ఆసక్తిని రెట్టింపు చేస్తాయట. ఉదాహరణకు చేతులు తాకించడం, ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం లాంటివి చేయడం వల్ల ఇద్దరి మధ్య చనువు పెరిగి, బంధం బలపడుతుందట.

పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!

కొత్తగా ట్రై చేయండి

రోజూ ఒకేలా సెక్స్ చేయడం వల్ల కూడా శృంగార జీవితం బోర్ కొడుతుందట. ముఖ్యంగా ఆడవారికి ఒకే భంగిమలో శృంగారం చేయడం పెద్దగా నచ్చకపోవచ్చట. కాబట్టి అప్పుడప్పుడు సెక్స్ స్టైల్ మార్చడం వల్ల ఇద్దరిలోనూ ఆసక్తి పెరుగుతుందంటున్నారు నిపుణులు.

పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!

సానుకూలతను పెంచుకోండి

మీ పడకగదిలో మీకు నచ్చని విషయాల గురించి .. మీరు బాగా ఎంజాయ్ చేసిన నిమిషం గురించి మాట్లాడుకోవడం వల్ల మీ శృంగార జీవితంలో సానుకూలత పెరుగుతుందట. ఇలాంటి సందర్భాలను గుర్తుచేసుకుని ఒకరిని ఒకరు పొగుడుకోవడం వల్ల శృంగార జీవితం మరింత సుఖమయం అవుతుందట.

పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!

సరదాగా మాట్లాడుకోవడం

మీ భాగస్వామితో శారీరకంగా కలవడం కోసం ముందు నుంచే మానసికంగా సిద్ధం చేయడం మంచిదట. ఉదాహరణకు ఫోన్లో తనతో సెక్స్ గురించి సరదాగా వారితో మాట్లాడటం, ఫ్లర్ట్ చేయడం లాంటివి. ఇలాంటివి చేయడం వల్ల మీరు, మీ పార్ట్నర్ శృంగారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారట.

పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!

వ్యాయామం చేయండి

వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. కానీ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల సెక్స్ కెపాసిటీ పెరుగుతుందట. వ్యాయామం మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరిచి.. శృంగార కోరికలను కూడా పెంచుతుందట.

పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!

ఇంటి పనుల్లో సాయం చేయండి

ఇంట్లో భార్య ఇది చేయాలి, భర్త ఇది చేయాలి అని షరతులు పెట్టుకోకుండా.. ఇద్దకు కలిసి పని చేసుకోవడం వల్ల కూడా శృంగార జీవితం బాగుంటుందంట. ఒకరి పనులు ఒకరు చేయడం వల్ల పరస్పరం ప్రేమ, గౌరవం పెరిగి పడక గదిలో సంతోషంగా గడుపుతారట.

పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!

రాత్రుళ్లే కాదు..

ఒకవేళ మీ భాగస్వామి శృంగార విషయంలో ఆసక్తి చూపకపోతే.. రాత్రుళ్లు కాకుండా వేరే సమయాల్లో శృంగారంలో పాల్గొనండి. ఎప్పుడూ ఒకే సమయంలో శృంగారం చేయడం కూడా రొటీన్ అనిపించి కొందరికి ఆసక్తి అనిపించకపోచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఖాళీ సమయం ఉంటే.. ఉదయమో, మధ్యాహ్నమో ట్రై చేసి చూడండి.

కలిసి తినడం, టీవీ చూడటం, కలిసి స్నానం చేయడం లాంటి చిన్న చిన్న విషయాలు కూడా దాంపత్య జీవితాన్ని బలంగా తయారు చేసి.. శృంగార జీవితాన్ని మరింత ఎంజాయ్ చేసేలా చేస్తాయని సెక్స్ నిపుణులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ఏ యోగాసనంతో ఏమేం లాభాలో తెలుసా..?

బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!

Diabetes : షుగ‌ర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా

బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్ చేస్తుందా?

Food safety tips : ఫ్రిజ్‌లో వీటిని అస‌లు పెట్ట‌కూడ‌దు.. ఎందుకో తెలుసా?

గోర్లను చూసి డ‌యాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!

COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి

monoclonal antibody treatment : ఒక్క‌రోజులోనే క‌రోనా ల‌క్ష‌ణాలు ఖ‌తం? అస‌లేంటి ఆ ట్రీట్‌మెంట్ ? ఎవ‌రికి అవ‌స‌రం ?

క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా ? మ‌ర‌ణించిన వ్య‌క్తి శ‌రీరంలో వైర‌స్ ఎంత‌సేపు బ‌తికి ఉంటుంది?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!
పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!
పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!

ట్రెండింగ్‌

Advertisement