ఏ యోగాసనంతో ఏమేం లాభాలో తెలుసా..?

హైదరాబాద్, జూన్ 21: కరోనా ప్రభావంతో మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోయింది. కరోనా, లాక్డౌన్ కారణంగా చాలా మంది ఇండ్లలోనే ఉండిపోయారు.దీని వల్ల శారీరక శ్రమ లేక చాలా మందిలో పలు అనారోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. యోగా ఒక్కో అనారోగ్యసమస్యకు ఒక్కో రకమైన యోగాసనం ద్వారా సరైన పరిష్కారం లభిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
-నవాసనం..
ఇది చాలా సరళమైన ఆసనం. ఇది మీ ప్యాక్స్, లోపలి తొడలకు మంచి ఆకారాన్నిస్తాయి. ఇది చేయడానికి మీ చేతులతో కాలిని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఫలితంగా గరిష్ఠ ప్రయోజనాలు పొందడానికి వీలైనంత ఎక్కువ సేపు ఉండేందుకు ప్రయత్నించండి.
-పూర్వోత్తరాసనం..
ఇది మీ బాహ్య తొడలపై బాగా పనిచేస్తుంది. మీ చేతులను బలోపేతం చేయడానికి, టోన్ చేయడానికి ఈ ఆసనం సహాయపడుతుంది. ఈ భంగిమలో మీరు మీ కాళ్లు, చేతులపై మీ శరీర బలాన్ని పెంచినప్పుడు హామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్ పై పనిచేస్తుంది.
-శాలభాసనం..
ఇది మీ వెనుక పిరుదులు, తుంటిపై బాగా పనిచేస్తుంది. దీన్ని చేయడానికి మీరు మీ కడుపుపై పడుకొని చేతులను తొడల కింద ఉంచండి. కాళ్లు వంగకుండా చూడాలి. వీలైనంత ఎక్కువ సమయం ఈ భంగిమలో ఉండండి. నెమ్మదిగా కాళ్లను కిందకు దించి మొదటి స్థానానికి తిరిగి చేర్చండి.
-ఉత్కాటాసనం..
ఈ ఆసనం వేయడం ద్వారా తొడ కండరాల నోప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా క్రమమైన రీతిని తెచ్చుకోవచ్చు. క్రమం తప్పకుండా ఈ ఆసనం వేయడం ద్వారా కండరాలు కూడా బలపడతాయి.
-వీరభద్రాసనం..
ఈ ఆనసనం ఛాతీ, ఊపితిత్తులు, భుజాలు, మెడ, కడుపు, గజ్జలను సాగదీస్తుంది. ఇది భుజాలు, చేతులు, వెనుక వైపు ఉండే కండరాలను కూడా బలపరుస్తుంది. తొడలు, చీలమండలను బలపరుస్తుంది. ఈ ఆసనం సయాటికాకు మంచి చికిత్స.
-నటరాజసనం..
ఇది తుంటిపై బాగా పనిచేస్తుంది. ఈ ఆసనం మంచి శరీరాకృతిని ఇస్తుంది. తోడల బాహ్య, అంతర్గత కండరాలను బలపరుస్తుంది. కటి నుంచి కాలి వరకు ఉన్న ప్రాంతంపై ఆసనం ప్రభావం పడుతుంది. ఈ ఆసనం ద్వారా భుజం, ఛాతీ, తొడలు, ఉదరం, కాళ్లకు మంచి ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Health
- Health news
- health tips
- Yoga
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

