Dear Zindagi | నెలల పాపకు ఆపరేషనా?
మా పాప వయసు మూడు నెలలు. పుట్టినప్పుడు బాగానే ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా స్కానింగ్‌లో అంతా బాగానే వచ్చింది. పుట్టిన తర్వాత బిడ్డ క్రమేపీ పాలు తీసుకోలేదు. ఆయాసంగా, ఎగపోతగా ఉండేది. పిల్లల డాక్టర్ యాంటీబయాటిక్స్ ఇస్తే కొంత నెమ్మదించింది.
Dear Zindagi | మా పాప వయసు మూడు నెలలు. పుట్టినప్పుడు బాగానే ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా స్కానింగ్‌లో అంతా బాగానే వచ్చింది. పుట్టిన తర్వాత బిడ్డ క్రమేపీ పాలు తీసుకోలేదు. ఆయాసంగా, ఎగపోతగా ఉండేది. పిల్లల డాక్టర్ యాంటీబయాటిక్స్ ఇస్తే కొంత నెమ్మదించింది. మళ్లీ అదే సమస్య తలెత్తేసరికి డాక్టర్ సలహా మేరకు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాం. ఆయన స్కాన్ చేసి బిడ్డకు గుండెలో రంధ్రం ఉందనీ, ఆపరేషన్ చేయాలనీ చెప్తున్నారు. ఇంత చిన్న వయసులో ఆపరేషన్ ఏంటి? మాకు ఆందోళనగా ఉంది. ముఖ్యంగా బరువు కూడా పెరగడంలేదు. పుట్టినప్పుడు ఉన్న బరువే ఇప్పటికీ ఉంది. మా బిడ్డ ఆపరేషన్ తట్టుకోగలదా? ఆపరేషన్ లేకుండా నయం చేసే మార్గం లేదా? సలహా ఇవ్వగలరు.
-ఓ పాఠకురాలు
కొన్ని కేసుల్లో సాధారణంగా శిశువు గుండెలోని కింది గదుల్లో ఉండే జఠరికల మధ్య ఉండే గోడకు రంధ్రం ఏర్పడుతుంది. అది 1 మి.మీ నుంచి 8 మి.మీ ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి 1 సెం.మీ సైజులో అతిపెద్దగా కూడా ఉంటుంది. అయితే ప్రతి గుండె రంధ్రానికీ ఆపరేషన్ అవసరం ఉండదు. చిన్న రంధ్రాలైతే వాటంతట అవే మూసుకుపోతాయి. మీ బిడ్డకు పైన చెప్పిన ఏదో ఒక సైజులో రంధ్రం ఉన్నట్టు తెలుస్తున్నది. వీఎస్డీ (వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్) కారణంగా రంధ్రం సైజు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నది. ఈ కారణంగా ఎక్కువ రక్తం కుడి గుండెలోకి వచ్చి, అక్కడినుంచి ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నది. అలా ఊపిరితిత్తులపై ఎక్కువ భారం పడి బిడ్డ ఆయాసంగా ఉంటున్నది. ఆయాసం కారణంగా సరిగ్గా పాలు తాగలేకపోవడం, ఎనర్జీ ఎక్కువగా ఖర్చు అయిపోవడం జరుగుతున్నది. అందుకే బరువు కూడా పెరగడంలేదు. కాబట్టి ఆపరేషన్ అవసరమే. గుండె ఆపరేషన్ అనగానే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గుండెకు చేసేది మరీ పెద్ద ఆపరేషనేమీ కాదు. ఈ రోజుల్లో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మీ డాక్టర్ సలహా మేరకు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌ను సంప్రదించడమే మంచిది. ఆపరేషన్ తర్వాత మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. బరువు పెరడం ఆరంభమవుతుంది.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

