మహిళా అభ్యున్నతి కోసం ప్రభుత్వం పాటుపడుతుంది

మైలార్‌దేవ్‌పల్లి: మహిళల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పేర్కొన్నా రు. మంగళవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లోని దుర్గ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే టి. ప్రకాశ్‌గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళ గ్రూప్ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, గ్రేటర్ ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని గుర్తు చేశారు. స్త్రీల హక్కులు, స్వేచ్ఛ, వారి భద్రత విషయంలో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. హైదరాబాద్ మహా నగరంలో అడుగడుగున 5 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మహిళల భద్రత పెంచారని అన్నారు.
గత ప్రభుత్వాలలో మహిళలు మంచి నీటి కోసం బిందెలు తీసుకొని రోడ్లపైకి వచ్చేవారు. గత ఆరేండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో ఎన్నడూ కూడా మహిళలు బిందెలతో రోడ్లపైకి రాలేదన్నారు. కేసీఆర్ మహిళల పట్ల గౌరవంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. పేదల ఇంట్లో ఆడబిడ్డ పుట్టిందంటే బాధ పటే రోజులు ఉండేవని వారి పెళ్లిళ్ల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లు, కళ్యాణలక్షీ, షాదిముబారక్ పథకాల ద్వారా పేద వారికి అండగా నిలుస్తుందన్నారు. మహిళ పొదుపు సంఘాలకు 50 వేల నుండి 15 లక్షల వరకు వడ్డి లేని రణాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు.
తాజావార్తలు
- ఫేస్బుక్, ట్విట్టర్లకు కేంద్రం ఝలక్:21న విచారణకు రండి!
- నేడు ఐపీవోకు ఐఆర్ఎఫ్సీ: లక్ష్యం రూ.4,633 కోట్ల సేకరణ
- గోస్వామికి బాలాకోట్ దాడి ముందే తెలుసా?!
- హిందూ మనోభావాలు దెబ్బతీసేలా తాండవ్?!
- ఆదాతో ఆర్థిక కష్టాలకు చెక్: బీ అలర్ట్.. కరోనా ఎఫెక్ట్
- మాస్క్.. మట్టిలో కలిసేందుకు 50 ఏండ్లు
- ఎస్వీబీసీకి రూ.1.11 కోట్ల విరాళం
- రేపు అంగన్వాడీ సిబ్బందికి చీరెలు పంపిణీ
- జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌వార్ కలకలం
- రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?