ఎదురుకాల్పులు : 13 మంది మావోయిస్టులు మృతి
మావోయిస్టులు మృతి | మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈటపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు- పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.

గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎటపల్లి పరిధిలోని పేడి-కోటమి అటవీప్రాంతంలో మావోయిస్టులు- పోలీసుల మధ్య శుక్రవారం తెల్లవారుజామున భీకర కాల్పులు జరిగాయి. పోలీసు కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఆరుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు గడ్చిరోలి డీఐజీ సందీప్ పాటిల్ వెల్లడించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఘటనాస్థలంలో తుపాకులను, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సీ-60 బెటాలియన్‌కు చెందిన పోలీసులు ఎటపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా నక్సల్స్ తారసపడటంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

