300 మీటర్ల ఎత్తున్న బిల్డింగ్ ఊగిపోయింది..

షెంజెన్: చైనాలోని షెంజెన్ నగరంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం ఊగిపోయింది. సుమారు 300 మీటర్ల ఎత్తు ఉన్న ఆ బిల్డింగ్.. గత మంగళవారం అకస్మాత్తుగా షేక్ అయ్యింది. స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్న ఆ బిల్డింగ్ చాలా సేపు ఊగిపోవడంతో దాంట్లో ఉన్న వ్యాపారులు, కిరాయిదారులు బయటకు పరుగులు తీశారు. బిల్డింగ్ కింద దగ్గరలో ఉన్నవాళ్లు కూడా ప్రాణభయంతో దూరం పరుగెత్తారు. భూకంపం వల్ల ఆ బిల్డింగ్ ఊగలేదని ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అధికారులు తేల్చారు. ఈ బిల్డింగ్ ఎలక్ట్రానిక్ మార్కెట్‌కు చాలా ఫేమస్. అయితే అధికారిక తనిఖీలు ముగిసిన తర్వాతనే ఆ బిల్డింగ్‌ను తెరవనున్నట్లు బిల్డింగ్ ఓనర్లు చెప్పారు. షెంజెన్ ఎలక్ట్రానిక్స్ గ్రూపు పేరుతో ఆ బిల్డింగ్ నిర్మించారు. సెమీకండక్లర్లు, ఎలక్ట్రానిక వస్తువులు తయారు చేసే సంస్థలు ఈ బిల్డింగ్‌లో ఉన్నాయి. ప్రధాన బిల్డింగ్‌లో ఎటువంటి లోపాలు కనిపించలేదని నిపుణులు చెప్పారు. 2000 సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ బిల్డింగ్‌ను ప్రస్తుతం డ్రోన్లతో పరిశీలిస్తున్నారు. అధికారులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే బిల్డింగ్‌ను మళ్లీ ఓపెన్ చేయనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

