శనివారం 28 నవంబర్ 2020
Vikarabad - Oct 31, 2020 , 03:56:39

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల అదుపు

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల అదుపు

 పెద్దేముల్‌: ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు, నేరా ల అదుపునకు పోలీసు చేపడుతున్న చర్యలు అన్ని ఇన్నీ కా దు. నేటి సమాజంలో ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, చిన్న పెద్ద తేడా లేకుండా, అడ్డు అదుపు లేకుండా ప్రతిరోజు ఎన్నో నేరాలు, మరెన్నో ఘోరాలు, ఇంకెన్నో ప్ర మాదాలు, దొంగతనాలు రోజు రోజుకూ విచ్చలవిడిగా పెరిగి క్రైమ్‌రేట్‌ కూడా పెరిగిపోతుంది. సమయం సందర్భం లేకుండా నిమిషాల్లో, క్షణాల్లో దొంగతనాలు, దోపీడీలు, మర్డర్లు, చైన్‌ స్నాచింగ్‌లు, ప్రమాదాలు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో నేరాల అదుపుకు పోలీసులకు సీసీ కెమెరాలు ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు మనం ఏ గ్రామంలో చూసినా సీసీ కెమెరాలు దర్శనమిస్తున్నాయి. నేరాలను అరికట్టడానికి పోలీసులు గ్రామీ ణ ప్రాంతాల్లో కూడా ప్రజలు సురక్షితంగా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి, కెమెరాలు లేని గ్రామా ల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతోనే నేరాలకు చెక్‌ పెట్టోచ్చని భావించి పెద్దేముల్‌ మండల కేంద్రంతో పాటు, ఆయా గ్రామాల్లో పోలీసులు ఆ యా గ్రామాల ప్రజలకు, కార్యాలయాల అధికారులకు, కం పెనీల యజమానులకు, గ్రామ సర్పంచ్‌లకు, ఇతర ప్రజా ప్రతినిధులకు సీసీ కెమెరాలపైన అవగాహన కల్పించి మం డల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో, వివిధ కంపెనీలతో కలిపి సుమారు 90 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి ప్రతిరోజూ నిఘా ఉంచుతున్నారు.  

గ్రామాల్లో అవగాహనకార్యక్రమాలు

శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల సంపూర్ణ రక్షణ పట్ల పోలీసులు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు, ప్రజలకు నేరా లు, ప్రమాదాలు, దొంగతనాల పట్ల అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామా ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో నేరాలు, పూర్తిగా తగ్గాయన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన గ్రామాల్లో ఎక్కడైనా, ఏదైనా నేరం, ప్రమాదం జరిగితే పోలీసులు క్షణాల్లో నేరస్తులను, నిందితులను పట్టుకొని క్షణాల్లో నేరాలను రుజువు చేసి వారిని జైళ్లకు పంపిస్తున్నారు.