మధ్యలోనే ఆగిపోయిన బిగ్ బాస్ షో..నిరాశలో ఫ్యాన్స్
బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఈ కార్యక్రమం కన్నడలోను మంచి ఆదరణ దక్కించుకుంది. గత ఏడాది కరోనా వలన వాయిదా పడ్డ సీజన్ 8 ఫిబ్రవరి 18న మొదలైంది. కొన్ని రోజులు సక్సెస్ ఫుల్‌గానే సాగిన, కరోనా సెకండ్ వేవ్ వలన ఈ కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించాల్సి వచ్చింది.
కర్ణాటకలో కేసులు బాగా పెరగుతుండడంతో లాక్డౌన్ విధించారు. మరోవైపు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న సుదీప్ అనారోగ్యం బారిన పడ్డారు. ఇలాంటి పరిస్థితులలో షోని క్యాన్సిల్ చేయడమే బెటర్ అని నిర్వాహకులు భావించారు. దీంతో 71 రోజుల పాటు సాగిన షోకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఇంకా హౌజ్‌లో 8 మంది మిగిలి ఉండగా, ప్రశాంత్ సమ్ బర్గీ, అరవింద్ కేపీ మధ్య ట్రోఫీ పోరు కొనసాగుతోంది. వైష్ణవి, శమంత్, దివ్య సురేశ్ టాప్ 5 రేసులో ఉన్నారు. పరిస్థితులు చక్కబడ్డాక ఈ షోకు సంబంధించిన విజేతలను ప్రకటిస్తారా లేదా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి..
సముద్ర సేతు-2 వేగవంతం
సన్‌రైజర్స్ 30 కోట్ల విరాళం
కొత్త రిలీజ్ డేట్ ప్రకటించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన ఆర్ఆర్ఆర్ టీం
కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి ఎన్టీపీసీ ఉద్యోగుల విరాళం
అమ్మాయి నచ్చింది.. ఇక పెళ్లే తరువాయి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

