కొత్త రిలీజ్ డేట్ ప్రకటించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన ఆర్ఆర్ఆర్ టీం

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే సంవత్సరాల తరబడి సెట్స్ పై ఉంటుందనే సంగతి మనందరికి తెలిసిందే. ఇక కరోనా చేయబట్టి అనుకున్న దానికంటే మరింత సమయం పడుతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కాల్పనిక గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. షూటింగ్ తుది దశకు చేరుకోగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
ఆర్ఆర్ఆర్ చిత్ర రిలీజ్ డేట్‌ని పలు కారణాల వలన వాయిదా వేసిన ఆర్ఆర్ఆర్ టీం ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ కోసం అన్వేషిస్తుందట. అక్టోబర్ 13న విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా వలన వాయిదా పడడంతో మరో కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే కనుక ఆ రోజు పోస్టర్‌తో పాటు చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. అలియా భట్, అజయ్ దేవగణ్, ఒలివియా మోరిస్ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- NTR
- Rajamouli
- ram charan
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

