ఒకే రకమైన 2 మాస్క్‌లు వద్దు!

ఒకే మాస్క్‌ను వరుసగా రెండు రోజులు వాడొద్దు
సర్జికల్ మాస్క్, వస్త్రంతో కూడిన మాస్క్ కలిపి ధరించాలి
‘డబుల్’ మాస్కు ధారణపై కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు
కరోనా కట్టడిలో భాగంగా ముఖానికి డబు ల్ మాస్క్ ధరించడంపై కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒకే రకమైన 2 మాస్క్‌లను ధరించవద్దని సూచించింది. రెండు మాస్క్‌లలో ఒకటి సర్జికల్ మా స్క్, మరొకటి వస్త్రంతో తయారుచేసిన మా స్క్ ఉండేలా చూసుకోవాలన్నది. అలాగే, ఒకే మాస్క్‌ను వరుసగా రెండు రోజులపాటు ధరించవద్దని పేర్కొన్నది.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నది. కరోనా కట్టడిలో ముఖానికి మాస్కు ధారణ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ముఖానికి రెండు మాస్కులను ధరించడం ద్వారా మహమ్మారి వ్యాప్తిని రెండురెట్లు మెరుగ్గా నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ‘డబుల్ మాస్కుల ధారణ’ విషయంలో పాటించాల్సిన నియమాలను కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది.
రెండు మాస్క్‌లు ఎలా ధరించాలంటే..
డబుల్ మాస్కు ధారణలో భాగంగా ఒకటి సర్జికల్ మాస్క్, మరొకటి రెండు లేదా మూడు పొరలతో తయారైన మాస్క్‌ను ధరించాలి.
ముక్కు మీద బిగుతుగా ఉండేలా మాస్క్ ధరించాలి.
శ్వాస క్రియకు ఆటంకం కలిగించేలా మాస్క్ ఉండకూడదు.
వస్త్రంతో కూడిన మాస్క్‌ను తరుచూ ఉతుకుతూ ఉండాలి.
డబుల్ మాస్క్ విషయంలో ఇవి వద్దు..
ఒకే రకమైన రెండు మాస్క్‌లను డబుల్ మాస్క్‌గా ధరించవద్దు.
ఒకే మాస్క్‌ను వరుసగా 2రోజులు వాడొద్దు.
డబుల్ మాస్క్ సామర్థ్యం ఏమిటంటే?
నాసికా రంద్రాల్లోకి వెళ్లే సార్స్-కోవ్-2 వైరస్‌ను సాధారణ మాస్క్‌తో పోలిస్తే డబుల్ మాస్క్ రెండు రెట్లు సమర్థంగా అడ్డుకుంటుందని ఓ అధ్యయనం తెలిపింది. సరైన మాస్కు ధారణ ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించింది. ఈ వివరాలు ‘జామా’ ఇంటర్నల్ మెడిసన్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- corona
- Covid19
- double mask
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

