శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Vikarabad - Aug 08, 2020 , 00:25:29

కొవిడ్‌-19ను ఆరోగ్యశ్రీలో చేర్చండి

కొవిడ్‌-19ను ఆరోగ్యశ్రీలో చేర్చండి

తాండూరు టౌన్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌19ను ఆరోగ్యశ్రీలో చే ర్చాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా నేత ఆనంద్‌కుమార్‌ మాదిగ కోరారు. శుక్రవా రం ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు తాం డూరు పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికభారంతో కరో నా చికిత్స చేయించుకోలేని పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదలను దృష్టిలో ఉంచుకుని కొవిడ్‌-19ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో నర్సింలు మాదిగ, దశరథ్‌ మాదిగ, బాల్‌రాజ్‌ మాదిగ, బద్రి పాల్గొన్నారు.


logo