e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home క్రైమ్‌ అక్రమంగా నిలువ ఉంచిన 70 ఆక్సిజన్‌ సిలిండర్ల సీజ్

అక్రమంగా నిలువ ఉంచిన 70 ఆక్సిజన్‌ సిలిండర్ల సీజ్

అక్రమంగా నిలువ ఉంచిన 70 ఆక్సిజన్‌ సిలిండర్ల సీజ్

న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో అక్రమంగా నిలువ ఉంచిన 70 ఆక్సిజన్‌ సిలిండర్లను అధికారులు సీజ్‌చేశారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. దీంతో కరోనా రోగులు భారీసంఖ్యలో దవాఖానల్లో చేరుతున్నారు. ఒక్కసారిగా బాధితులు వచ్చిచేరుతుండటంతో హాస్పిటళ్లలో ఆక్సిజన్‌ కొరత వెంటాడుతున్నది. దీనిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు ఆక్సిజన్‌ సిలిండర్లను బ్లాక్‌చేసి డబ్బులు దండుకుంటున్నారు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఢిల్లీలోని ఆక్సిజన్‌ రీఫిల్లింగ్‌ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా నైరుతి ఢిల్లీలోని ఓ ఆక్సిజన్‌ రీఫిల్లింగ్‌ కేంద్రంలో 70 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

నగరంలోని హాస్పిటళ్లు ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. అక్రమ రీఫిల్లింగ్‌ను నివారించడానికి మెటల్ కటింగ్, వెల్డింగ్ యూనిట్లను తనిఖీలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా ద్వారకలోని నంగ్లి సఖ్రావతిలోని రీఫిల్లింగ్ సెంటర్‌లో 70 సిలిండర్లు, ఆక్సిజన్ సిలోస్, రీఫిల్లింగ్ పాయింట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

హాస్పిటల్‌ నుంచి 1,710 కొవిడ్‌ వ్యాక్సిన్లు మాయం
ఫాబిఫ్లూ ఫ్రీగా ఇస్తాన‌న్న గంభీర్‌.. ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌న్న‌ కాంగ్రెస్‌, ఆప్‌
వారివి మాటలు ఘనం.. చేతలు శూన్యం: మంత్రి సత్యవతి
న‌కిలీ టీకాలు.. ఒక డోసు వెయ్యి డాల‌ర్లు
నెట్‌ ఫ్లిక్స్‌ లో చూసేయండి
IPL 2021: మ‌ళ్లీ ఓడిన నైట్‌రైడ‌ర్స్‌.. షారుక్ ఏమ‌న్నాడో తెలుసా?
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అక్రమంగా నిలువ ఉంచిన 70 ఆక్సిజన్‌ సిలిండర్ల సీజ్

ట్రెండింగ్‌

Advertisement