Ind vs Pak | పాకిస్థాన్ చర్యలకు తగిన పర్యవసానాలు ఉంటాయ్.. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వేదికగా భారత్ వార్నింగ్
Ind vs Pak | ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) వేదికగా పాకిస్థాన్ (Pakistan) పై భారత్ (India) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత వంటి సూత్రాలను పాకిస్థాన్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. తమపై జరిగే ఉగ్రదాడుల నుంచి తమను తాము రక్షించుకునే పూర్తి హక్కు తమకు ఉందని, పాకిస్థాన్ చర్యలకు తగిన పర్యవసానాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించింది.
Ind vs Pak : ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) వేదికగా పాకిస్థాన్ (Pakistan) పై భారత్ (India) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత వంటి సూత్రాలను పాకిస్థాన్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. తమపై జరిగే ఉగ్రదాడుల నుంచి తమను తాము రక్షించుకునే పూర్తి హక్కు తమకు ఉందని, పాకిస్థాన్ చర్యలకు తగిన పర్యవసానాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించింది. చైనా (China) అధ్యక్షతన జరిగిన యూఎన్ఎస్సీ బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీశ్ పర్వతనేని (Harish Parvathaneni) మాట్లాడుతూ.. పాకిస్థాన్ చేసిన ఆధారరహిత ఆరోపణలను తిప్పికొట్టారు.
స్వతంత్ర భారతదేశం ఏర్పడిన నాటి నుంచి నిత్యం సరిహద్దు ఆక్రమణలకు వ్యతిరేకంగా పోరాడుతోందని హరీశ్ పర్వతనేని అన్నారు. చట్టబద్ధంగా, తిరిగి మార్చలేని విధంగా భారత్‌లో విలీనమైన భూభాగాలను ఆక్రమించుకోవడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తూనే ఉందని ఆయన చారిత్రక వాస్తవాలను గుర్తుచేశారు. భారత్‌ను వెయ్యి గాయాలతో రక్తమోడించాలనే పాకిస్థాన్ సిద్ధాంతం, వారి డొల్ల మాటలను బట్టబయలు చేస్తోందని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదం నుంచి తనను రక్షించుకునే పూర్తి హక్కు భారత్‌కు ఉందని స్పష్టంచేశారు. తన చర్యలకు పాకిస్థాన్ తగిన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.
ఉగ్రవాదం, మత ఛాందసవాదం, హింసాత్మక రాడికలిజం వంటి దుష్టశక్తులను పాకిస్థాన్ నిరంతరం ప్రోత్సహిస్తోందని, ఇకనైనా ఉగ్రవాదానికి అన్ని విధాలుగా మద్దతును శాశ్వతంగా నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు ఇదే చర్చలో పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ అంశాన్ని, సింధు జలాల ఒప్పందాన్ని ప్రస్తావించారు. దీనికి భారత్ బలంగా బదులిచ్చింది. 2025 ఏప్రిల్‌లో పహల్గామ్లో 26 మంది పౌరుల మరణానికి కారణమైన ఉగ్రదాడి తర్వాతే భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిందనే సంగతి గుర్తుంచుకోవాలని చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

