ఏపీ ఆయకట్టుకు 19.68 టీఎంసీలు చాలు
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఏపీ ఆయకట్టుకు 19.68టీఎంసీలు సరిపోతాయని తెలంగాణ వెల్లడించింది. కుడికాల్వ ఆయకట్టుకు 140టీఎంసీలు అనవసరమని ట్రిబ్యునల్‌కు తేల్చిచెప్పింది.
- ట్రిబ్యునల్‌లో ఏపీ వాదనలకు తెలంగాణ కౌంటర్
హైదరాబాద్, నవంబర్18 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఏపీ ఆయకట్టుకు 19.68టీఎంసీలు సరిపోతాయని తెలంగాణ వెల్లడించింది. కుడికాల్వ ఆయకట్టుకు 140టీఎంసీలు అనవసరమని ట్రిబ్యునల్‌కు తేల్చిచెప్పింది. కేంద్రం జారీ చేసిన సెక్షన్-3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఏపీ వినిపించిన వాదనలపై తెలంగాణ ప్రతివాదనలు ప్రారంభించింది. ఢిల్లీలో బుధవారం కొనసాగిన విచారణలో పలు అంశాలపై తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు కొనసాగించారు.
వాస్తవ అవసరాలకు మించి ఏపీ అదనపు కృష్ణా జలాలను కేటాయించాల్సిన అవసరం లేదని నివేదించింది. పెరిగిన ఆయకట్టుకు కృష్ణా జలాలపై అదనపు భారం మోపకుండానే ‘వైఎస్ఆర్ పల్నాడు కరవు నివారణ పథకం (78 టీఎంసీలు)’ ద్వారా నీరందించవచ్చని వాదించారు. కేసీ కాలువకు 31.90 టీఎంసీలు కేటాయించినా, వాస్తవ నీటి అవసరం కేవలం 7.71 టీఎంసీలు మాత్రమేనని, ఆ జలాలనూ తుంగభద్ర నుంచి వాడుకోవాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలతో పాటు బనకచర్ల ఎసేప్ చానల్ ద్వారా అదనపు వనరులను ఏపీ అభివృద్ధి చేసుకుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

