తండ్రీకూతుళ్ల కథతో కింగ్ 100?
అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున నూరవ చిత్రం ‘కింగ్ 100’ ఇంకొన్ని వారాల్లో విడుదల కానున్నది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ల కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున నూరవ చిత్రం ‘కింగ్ 100’ ఇంకొన్ని వారాల్లో విడుదల కానున్నది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ల కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఇది తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే కథట. ఇందులో నాగార్జున కూతురుగా సుష్మిత భట్ నటిస్తున్నారు. వారిద్దరి పాత్రల ఎమోషన్సే సినిమాకు ప్రధాన బలమట.
ఇక టబు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో ఆమె మహంతి ఝాన్సీరాణిగా ప్రతినాయిక పాత్రలో కనిపిస్తారట. ఒకప్పటి రొమాంటిక్ జోడీ అయిన నాగార్జున, టబు.. ఈ సినిమాలో హీరో, విలన్గా కనిపించడం ఆసక్తికరమైన విషయం. కథాపరంగా వీరిద్దరి మధ్య భీకరమైన పోరు ఉండబోతున్నదని ఇన్సైడ్ టాక్. ఇంకా ఐశ్వర్యరాజేష్, అశోక్ సెల్వన్, రవీంద్ర విజయ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: రాజా మహదేవన్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్, దర్శకత్వం: రా.కార్తీక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

