Home
Sports
Hyderabad Suffer Second Defeat In Syed Mushtaq Ali Trophy After Vidarbha Chase Down 198 Run Target
హైదరాబాద్ రెండో ఓటమి
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ (స్మాట్)లో హైదరాబాద్ జట్టుకు రెండో పరాభవం ఎదురైంది. గత మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌ను ఓడించిన జోష్‌లో ఉన్న మిలింద్ సేన..
కోల్‌కతా: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ (స్మాట్)లో హైదరాబాద్ జట్టుకు రెండో పరాభవం ఎదురైంది. గత మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌ను ఓడించిన జోష్‌లో ఉన్న మిలింద్ సేన.. గురువారం విదర్భతో జరిగిన గ్రూప్-డీ పోరులో బ్యాట్‌తో రెచ్చిపోయినా బంతితో విఫలమై 3 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. హైదరాబాద్ ఇచ్చిన 198 పరుగుల లక్ష్యాన్ని విదర్భ.. 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
కెప్టెన్ అథర్వ థైడె (45 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) దూకుడైన ఆటకు తోడు ఆఖర్లో వరుణ్ బిస్త్ (6 బంతుల్లో 3 సిక్స్‌లతో 22 నాటౌట్) మెరుపులతో ఆ జట్టును గెలిపించారు. తొలుత తన్మయ్ అగర్వాల్ (49), కొడిమెల హిమతేజ (41) రాణించడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లకు 195/8 స్కోరు చేసింది. శుక్రవారం జరిగే తర్వాతి మ్యాచ్‌లో గోవాతో హైదరాబాద్ తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

