వారిని ప్రభుత్వ ఐవీఎఫ్ కేంద్రాలకు తరలించాలి
కృత్రిమ గర్భధారణ కోసం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ లిమిటెడ్‌కు చెందిన ఓయాసిస్ ఫెర్టిలిటీ క్లినిక్‌లలో చికిత్స పొందుతున్నవారిని సమీపంలోని ప్రభుత్వ ఐవీఎఫ్ కేంద్రాలకు తరలించి చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశించింది.
- అది ప్రభుత్వ వైద్యుల కమిటీ ఆధ్వర్యంలో జరుగాలి
- సద్గుగురు హెల్త్‌కేర్ సర్వీసెస్ పిటిషన్‌పై హైకోర్టు
- అండాల సేకరణపై దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టీకరణ
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): కృత్రిమ గర్భధారణ కోసం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ లిమిటెడ్‌కు చెందిన ఓయాసిస్ ఫెర్టిలిటీ క్లినిక్‌లలో చికిత్స పొందుతున్నవారిని సమీపంలోని ప్రభుత్వ ఐవీఎఫ్ కేంద్రాలకు తరలించి చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశించింది. ఇందు కోసం నిపుణులతో కూడిన వైద్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అక్రమ అండాల సేకరణ కేసులో దర్యాప్తు పేరిట డాక్టర్లను అదుపులోకి తీసుకోవడాన్ని, తమ విధుల్లో జోక్యం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బీ చంద్రసేన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అండాలకు సంబంధించి తాము కేవలం కస్టోడియన్లమేనని, అండాల సేకరణలో తమకు ఎలాంటి పాత్రలేదని తెలిపారు.
ప్రస్తుతం అకడ 17,156 అండాలు ఉన్నాయని, వాటి రక్షణకు సాంకేతిక చర్యలు చేపట్టాల్సి ఉన్నదని చెప్పారు. అంతేగాకుండా సంతానం కోసం చికిత్స పొందుతున్న 51 మందికి ఇప్పటికే కొన్ని సైకిళ్లు పూర్తయ్యాయని, వాటిని కొనసాగించకపోతే వారు ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చికిత్సలు అందించేందుకు డాక్టర్లను అనుమతించాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజే వాదనలు వినిపిస్తూ.. వైద్యులైనప్పటికీ వారు నిందితులేనని, దర్యాప్తును ఎదురోవాల్సిందేనని స్పష్టం చేశారు. అండాలను దానం చేసినవారిని నవంబర్ 16న టాస్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారని, ఓయాసిస్ పేరుతో నిర్వహిస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలతోపాటు ఏఆర్టీ బ్యాంకు కార్యకలాపాలపై నమోదైన 8 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతున్నదని పేర్కొంటూ.. ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదని కోరారు. ఈ వాదనల అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ..
ఓయాసిస్ ఫెర్టిలిటీ కేంద్రాల్లో ఉన్నవారి పర్యవేక్షణకు వైద్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని వైద్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ఆ కేంద్రాల్లో ఉన్న 51 మందిని ఈ కమిటీ పర్యవేక్షణలో సమీపంలోని ప్రభుత్వ ఐవీఎఫ్ కేంద్రాలకు తరలించి చికిత్స కొనసాగించాలని, అకడ నిల్వచేసిన అండాల భధ్రతకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దర్యాప్తునకు సహకరించడంతోపాటు వైద్యాధికారులు జారీచేసిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని పిటిషనర్లకు స్పష్టం చేశారు. పిటిషనర్ ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేశారు.
ఎఫ్ఐఆర్లను విలీనం చేయండి..
అండాల అక్రమ సేకరణపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా వైద్యాధికారుల ఫిర్యాదు మేరకు డాక్టర్ గేదెల దుర్గారావుపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులన్నింటినీ విలీనం చేసి ఒకే కేసుగా దర్యాప్తు చేయడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో తనపై నమోదవుతున్న కేసులను విలీనం చేయాలంటూ డాక్టర్ దుర్గారావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ టీ మాధవీదేవి బుధవారం విచారణ చేపట్టారు. దీనిపై కౌంటర్ల దాఖలుకు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజే కోరారు. దీంతో ప్రతివాదులైన పోలీసు కమిషనర్లు, ఎస్‌హెచ్‌వోలు, జిల్లా వైద్యాధికారులకు నోటీసులు జారీచేసిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

