Viral video : ఓ మహిళ రెచ్చిపోయింది. ఆటో డబ్బులు అడిగాడన్న కోపంతో ఆటో డ్రైవర్ (Auto driver) పై దాడి చేసింది. దాంతో భయపడిన అతడు డబ్బులు వద్దని వారిస్తున్నా వినకుండా దాడికి పాల్పడింది. దాడి చేయడమే కాకుండా ఈ దాడి ఘటనను వీడియో తీయమని తన సోదరిని కోరింది. ఆమె కొడుతుండగా ఆమె సోదరి వీడియో తీసింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని మీర్జాపూర్ (Mirzapur) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
అనంతరం దాడికి పాల్పడిన మహిళ, ఆటో డ్రైవర్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ మరుసటి రోజు ఆటో డ్రైవర్‌పై దాడి వీడియోను సదరు మహిళ తన ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్టు చేసింది. దాంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. అది చూసిన ఆటో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళ తనపై అన్యాయంగా దాడి చేయడమేగాక, ఆ దాడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ అసభ్యంగా మాట్లాడటంవల్లే తాను దాడి చేశానని సదరు మహిళ చెబుతుండగా.. ఆటో కిరాయి అడగడంతో స్టూడెంట్స్‌ను కిరాయి అడుగుతావా అంటూ దాడికి పాల్పడిందని ఆటో డ్రైవర్ తెలిపాడు. తనను కొట్టిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టి అవమానించిందని, తనను ఏరియాలో అడుక్కోవడానికి కూడా పనికిరాకుండా చేసిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆటో డ్రైవర్ డిమాండ్ చేస్తున్నాడు. కాగా పోలీసులు సదరు మహిళ ఇన్‌స్టా ఖాతాను చెక్ చేసి అందులో 28 వేల వీడియోలు, రీల్స్ ఉన్నట్లు గుర్తించారు.
#VIRAL | “Video bana iski g**nd marungi, md*rchd, x@$£$”
A young woman hurled abuses & assaulted an auto driver simply for asking for his fare. Despite being innocent, the driver kept apologizing!
📍Mirzapur’s Katra area, Uttar Pradesh
What should be done with such people? pic.twitter.com/4FR03h5nvD
— Ashwini Shrivastava (@AshwiniSahaya) January 14, 2025
Crime news | మరో మూడు రోజుల్లో పెళ్లి.. కూతురును కాల్చిచంపిన తండ్రి
Ravichandran Ashwin | బయట అనుకునేవన్నీ నిజాలు కావు.. రిటైర్మెంట్పై భారత బౌలర్ అశ్విన్
Robotic Mules | ఆర్మీ అమ్ములపొదిలోకి 100 రోబోటిక్ డాగ్స్.. Video
Big discount | ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లు.. ధర ఎంత తగ్గిందంటే..!
IT Returns | ఐటీ రిటర్న్స్ దాఖలుకు నేడే ఆఖరు.. గడువు దాటితే ఏమవుతుందంటే..!
Rahul Gandhi | కేజ్రీవాల్‌కు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదు.. దొందూ దొందే : రాహుల్‌గాంధీ
Arvind Kejriwal | రాహుల్‌గాంధీని ఒక్క మాటంటే బీజేపీకి పొడుచుకొచ్చింది : అర్వింద్ కేజ్రీవాల్