Ravichandran Ashwin : భారత స్టార్ బౌలర్ (Indian star bowler) రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆస్ట్రేలియా టూర్లో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. అయితే ఆయనకు అవమానం జరగడంవల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు కూడా నెట్టింట తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఫేర్వెల్ టెస్టు (Farewell test) ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో వీటన్నింటిపై అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించాడు. తన రిటైర్మెంట్ గురించి బయట అనుకొనేవన్నీ నిజాలు కాదని, ప్రస్తుత రోజుల్లో ఫ్యాన్ వార్ అనేది ఓ రేంజ్లో ఉందని వ్యాఖ్యానించాడు. తాను బ్రేక్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, అందుకే ఈ సిరీస్ మధ్యలోనే బయటకి వచ్చేశానని చెప్పారు. తన రిటైర్మెంట్ ప్రకటన గురించి బయట రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని, అందులో ఎలాంటి వాస్తవాలు లేవని అన్నారు.
ఫేర్వెల్ మ్యాచ్ ఆడితే బాగుండునన్న మాజీల అభిప్రాయాలపై కూడా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా ఇలాంటి ఫేర్వెల్ మ్యాచ్‌లకు తాను అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వనని, అదేమంత ముఖ్యమైన విషయం కాదని అన్నాడు. ఒకవేళ నాకు అలాంటి ఛాన్స్ ఇవ్వాలని స్క్వాడ్‌లోకి తీసుకొని, తర్వాత సమీకరణాల కోసం తుది జట్టు నుంచి తొలగిస్తూ సంతోషంగా ఉండగలనా అని అశ్విన్ ప్రశ్నించాడు. అభిమానుల నోట ఈయన ఇంకా ఎందుకు..? అనే మాట రాకముందే ఆటకు ముగింపు పలకడం మంచిదనుకున్నానని ఆయన చెప్పాడు.
Robotic Mules | ఆర్మీ అమ్ములపొదిలోకి 100 రోబోటిక్ డాగ్స్.. Video
Big discount | ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లు.. ధర ఎంత తగ్గిందంటే..!
IT Returns | ఐటీ రిటర్న్స్ దాఖలుకు నేడే ఆఖరు.. గడువు దాటితే ఏమవుతుందంటే..!
Rahul Gandhi | కేజ్రీవాల్‌కు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదు.. దొందూ దొందే : రాహుల్‌గాంధీ
Arvind Kejriwal | రాహుల్‌గాంధీని ఒక్క మాటంటే బీజేపీకి పొడుచుకొచ్చింది : అర్వింద్ కేజ్రీవాల్