IT Returns : ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇవాళే ఆఖరు తేది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లేట్, రివైజ్డ్ ఐటీ రిటర్న్స్‌ను జనవరి 15వ తేదీ లోగా దాఖలు చేయాల్సి ఉంది. ఇవాళే గడువు ముగుస్తున్నందున ఎలాంటి జరిమానాలు పడకూడదంటే వెంటనే ట్యాక్స్ పేయర్స్ తమ ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాలి.
ఒకవేళ ఇవాళ ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయడంలో విఫలమైతే టాక్స్ పేయర్స్ లీగల్ నోటీసులు, జరిమానాలు, ఇతర తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూలై 31 లోగా ఒరిజినల్ ఐటీఆర్ ఫైల్ దాఖలు చేసిన వాళ్లు మాత్రమే రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఒరిజినల్ ఐటీఆర్‌లో సవరణలు, అప్డేట్స్ ఉంటే రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేస్తారు. ఐటీ రిటర్న్ ఫైల్ చేయకపోతే
అదేవిధంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూలై 31 లోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేకపోయిన వారు డిసెంబర్ 2024 వరకు బీ లేటెడ్ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ బీ లేటెడ్ రిటర్న్ కోసం ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉన్న వారు రూ.1000, ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉన్న వారు రూ.5000 ఆలస్య రుసుము చెల్లించాలి.
అంతేగాక సెక్షన్ 234A ప్రకారం 2024 జూలై 31 నుంచి ఔట్‌స్టాండింగ్ టాక్స్‌పై నెలకు 1 శాతం చొప్పున వడ్డీ వేస్తారు. బీ లేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయడంలో కూడా విఫలమైతే టాక్స్ పేయర్లకు ఇన్‌కం టాక్స్ డిపార్టుమెంట్ నోటీసులు పంపుతుంది. అదనంగా జరిమానాలు కూడా విధిస్తుంది.
Rahul Gandhi | కేజ్రీవాల్‌కు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదు.. దొందూ దొందే : రాహుల్‌గాంధీ
Arvind Kejriwal | రాహుల్‌గాంధీని ఒక్క మాటంటే బీజేపీకి పొడుచుకొచ్చింది : అర్వింద్ కేజ్రీవాల్
Sharad Pawar | ఢిల్లీ ఎన్నికల్లో అర్వింద్ కేజ్రీవాల్‌కు మద్దతు నిలువాలి : శరద్‌పవార్
Arvind Kejriwal | వాళ్లు డబ్బు, బంగారం పంచినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా..? : అర్వింద్ కేజ్రీవాల్