Arvind Kejriwal : వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని వినియోగించి ఎన్నికల కోడ్ (Election code) ను ఉల్లంఘించారంటూ ఢిల్లీ సీఎం (Delhi CM) అతిషి (Atishi) పై కేసు నమోదు చేయడాన్ని.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ (AAP Convenor) అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తప్పుపట్టారు. బీజేపీ నేతలు బహిరంగంగా నగదు, బంగారు గొలుసులు పంచుతున్నట్టు తమకు సమాచారం ఉన్నదని, అయినా వాళ్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు కాదా..? అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ నేతలు బహిరంగంగా డబ్బు, బంగారం పంచుతున్నా ఎన్నికల సంఘానికి కోడ్ ఉల్లంఘించినట్టు కనిపించడం లేదుగాని, అతిషి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు కనిపిస్తోందా..? అని కేజ్రీవాల్ మండిపడ్డారు. న్యూఢిల్లీలో తనపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ రూ.1100 చొప్పున పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నాడని, ఓటర్లు ఆ డబ్బు తీసుకోవాలని, ఓటును మాత్రం అమ్ముకోవద్దని ఆయన సూచించారు.
కాగా, కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఢిల్లీ సీఎం అతిషిపై ఇవాళ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. కల్కాజీలోని ఆప్ కార్యాలయానికి అతిషి ప్రభుత్వ వాహనంలో ఎన్నికల సామాగ్రిని తెప్పించుకున్నారని స్థానిక నివాసి అయిన కేఎస్ దుగ్గల్ గోవింద్‌పురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందించారు. ఎన్ని కేసులు పెట్టినా తాము న్యాయపోరాటం చేస్తామని అన్నారు.
Atishi nomination | కల్కాజీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. Video
Actress Honey Rose | లైంగిక వేధింపుల కేసులో బాబీ చెమ్మనూర్‌కు బెయిల్
UGC-NET | యూజీసీ నెట్ పరీక్ష వాయిదా.. ఎందుకంటే
Offer | బ్రాహ్మణ జంట నలుగురు పిల్లలను కంటే.. మధ్యప్రదేశ్ బోర్డు వినూత్న ఆఫర్..!