UGC-NET : సంక్రాంతి పండుగ (Sankranti Festival) కారణంగా ఈ నెల 15న జరగాల్సిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ నెల 16న జరగాల్సిన పరీక్షను యథాతథంగా నిర్వహిస్తామని తెలిపింది.
యూజీసీ నెట్ 2024 (డిసెంబర్) పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఈ నెల 3న మొదలైన ఈ పరీక్షలు ఈ నెల 16న ముగియనున్నాయి. అయితే పండుగ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి పలు వినతులు వస్తుండటంతో ఈ నెల 15న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు పేర్కొన్నది. ఈ పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.
Offer | బ్రాహ్మణ జంట నలుగురు పిల్లలను కంటే.. మధ్యప్రదేశ్ బోర్డు వినూత్న ఆఫర్..!
Z-Morh Tunnel | సోన్మార్గ్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఇవీ టన్నెల్ ప్రత్యేకతలు
Maha Kumbh | యూపీ సర్కారుకు కాసులు కురిపించనున్న మహాకుంభమేళా.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?