Z-Morh Tunnel : ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఇవాళ జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని సోన్మార్గ్ (Sonmarg) ప్రాంతంలో జడ్ మోడ్ సొరంగాన్ని (Z-Morh Tunnel) ప్రారంభించారు. ప్రధాని రాక నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. టన్నెల్ ప్రారంభోత్సవంలో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు.
శ్రీనగర్ నుంచి కార్గిల్ వెళ్లే దారిలో శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఈ టన్నెల్‌ను నిర్మించారు. ఈ టన్నెల్ నిర్మాణం కోసం ఏకంగా రూ.2,500 కోట్లు ఖర్చు చేశారు. భారత రక్షణ రంగానికి వ్యూహాత్మకంగా ఈ టన్నెల్ చాలా కీలకం కానుంది. ఈ జడ్ మోడ్ సొరంగం 6.5 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ టన్నెల్ ద్వారా ఏ సీజన్లోనైనా లడఖ్‌కు చేరుకోవడానికి వీలవుతుంది. టన్నెల్‌కు సంబంధించి 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గత ఏడాది పూర్తయ్యాయి.
ఈ జెడ్ మోడ్ టన్నెల్ భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. దాదాపు సముద్రమట్టానికి 8,500 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. అత్యంత శీతలమైన లడఖ్‌ను ఏ సీజన్లో అయినా సందర్శించేందుకు ఈ టన్నెల్ ఉపయోగపడనుంది. ఈ సొరంగం రవాణా వ్యవస్థతోపాటు రక్షణ వ్యవస్థకు కూడా కీలకం కానుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సోనామార్గ్ పట్టణానికి టన్నెల్ ద్వారా వెళ్లొచ్చు. జమ్ముకశ్మీర్‌లో ‘జడ్ మోడ్’ టన్నెల్ ఏర్పాటుతో కార్గిల్ మరింత సురక్షితంగా మారింది.
గతంలో కార్గిల్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడగా భారత్ ఏకంగా యుద్ధమే చేయాల్సి వచ్చింది. శీతాకాలంలో తీవ్రంగా మంచు కురిసే సమయాన్ని ఆసరా చేసుకుని ఉగ్రవాదులు భద్రతాబలగాలపై దాడులకు తెగబడ్డారు. అప్పట్లో కార్గిల్ ప్రాంతం పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తగతమైతే శ్రీనగర్–లేహ్ మధ్య రాకపోకలు నిలిచిపోయేవి. ఇప్పుడు సొరంగం ద్వారా సైన్యం కార్గిల్‌కు వేగంగా చేరుకునే అవకాశం ఉంది.
#WATCH | Sonamarg, Jammu & Kashmir: Prime Minister Narendra Modi inaugurated the Z-Morh tunnel
CM Omar Abdullah, LG Manoj Sinha and Union Minister Nitin Gadkari were also present.
(Source: DD/ANI) pic.twitter.com/kS3jjgonfK
— ANI (@ANI) January 13, 2025
Jammu & Kashmir: Prime Minister Narendra Modi inaugurated the Z-Morh tunnel in Sonamarg.
(Source: DD/ANI) pic.twitter.com/NfAs22Aflk
— ANI (@ANI) January 13, 2025
#WATCH | Jammu & Kashmir: Prime Minister Narendra Modi inaugurates the Z-Morh tunnel in Sonamarg today.
CM Omar Abdullah and LG Manoj Sinha, Union Minister Nitin Gadkari are also present.
(Source: DD/ANI)#KashmirOnTheRise pic.twitter.com/GF7rwZaVn1
— ANI (@ANI) January 13, 2025
Maha Kumbh | యూపీ సర్కారుకు కాసులు కురిపించనున్న మహాకుంభమేళా.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?
Stock markets | కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం
Maha Kumbh | మహా కుంభమేళాకు భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు.. పట్టాలపైకి 13వేల రైళ్లు..!
Health Tips | మిమ్మల్ని నెలసరి సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే తరచూ ఈ పండు తినండి..!